UPSC Civils Services 2025 : యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2025.. నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీ!

యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌లో అత్యంత క్రేజీ పరీక్ష.. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌!

➔    ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ తేదీ: 2025, జనవరి 22
➔    దరఖాస్తు చివరి తేదీ: 2025, ఫిబ్రవరి 11 
➔    ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: 2025, మే 25 
➔    మెయిన్‌ పరీక్షలు: 2025, ఆగస్ట్‌ 22 నుంచి అయిదు రోజులు.
➔    అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉతీర్ణులు అర్హులు.
➔    యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌లో అత్యంత క్రేజీ పరీక్ష.. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌! ఈ పరీక్షకు ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌ సాగిస్తూ ఉంటారు. సివిల్స్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అవి..ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్‌;పర్సనాలిటీ టెస్ట్‌. 

Paris Olympics: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్

ప్రిలిమినరీ పరీక్ష
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రెండు పేపర్లలో 400 మార్కులకు ఉంటుంది. పేపర్‌–1లో జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌–2లో కాంప్రహెన్షన్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
మెయిన్‌ ఎగ్జామినేషన్‌
➔    ప్రిలిమ్స్‌ తర్వాత రెండో దశలో పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించే మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. అవి.. జనరల్‌ ఎస్సే (పేపర్‌–1); జనరల్‌ స్టడీస్‌–1(పేపర్‌–2); జనరల్‌ స్టడీస్‌–2(పేపర్‌–3); జనరల్‌ స్టడీస్‌–3 (పేపర్‌–4); జనరల్‌ స్డడీస్‌–4(పేపర్‌–5); ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–1(పేపర్‌–6); ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–2 (పేపర్‌–7). ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్‌ పరీక్ష జరుగుతుంది. ఇందులో పేపర్‌–6, పేపర్‌–7లకు సంబంధించి అభ్యర్థులు కమిషన్‌ నిర్దేశించిన 25 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అర్హత పరీక్షలుగా జనరల్‌ ఇంగ్లిష్, స్థానిక భాష పరీక్ష కుడా ఉంటాయి. 
➔    జనరల్‌ స్టడీస్‌–1లో హిస్టరీ అండ్‌ జాగ్రఫీ; జనరల్‌ స్టడీస్‌–2లో పాలిటీ, గవర్నెన్స్, అంతర్జాతీయ అంశాలు, సామాజిక న్యాయం; జనరల్‌ స్టడీస్‌–3లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; జనరల్‌ స్టడీస్‌–4లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

AP MBBS & BDS Admissions: AP MBBS & BDS Admissions: నేటి నుంచి ఎంబీబీఎస్ & బీడీఎస్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

చివరగా ఇంటర్వ్యూ
మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత చివరగా పర్సనాలిటీ టెస్ట్‌ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 275 మార్కులు కేటాయించారు. ఇందులో చూపిన ప్రతిభ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌ మార్కుల­ను క్రోడీకరించి.. తుది విజేతలను ఖరారు చేస్తారు. వారికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా దాదాపు 20 సర్వీసుల్లో నియామకాలు అందజేస్తారు. 

#Tags