Combined Geo Scientist 2025 : కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2025.. పరీక్ష తేదీ!
➔ నోటిఫికేషన్ విడుదల తేదీ: 2024, సెప్టెంబర్ 4
➔ దరఖాస్తు చివరి తేదీ: 2024, సెప్టెంబర్ 24
➔ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2025, ఫిబ్రవరి 9
➔ మెయిన్ పరీక్ష తేదీ: 2025, జూన్ 21
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖల్లో స్పెషలైజ్డ్ పోస్ట్‌ల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. జియాలజిస్ట్ గ్రూప్–ఎ; జియో ఫిజిసిస్ట్; కెమిస్ట్–గ్రూప్–ఎ; సైంటిస్ట్–బి(హైడ్రాలజీ); సైంటిస్ట్–బి(కెమికల్) గ్రూప్–ఎ; సైంటిస్ట్–బి (జియో ఫిజిక్స్) గ్రూప్–ఎ పోస్ట్‌లు అందుబాటులో ఉంటాయి.
Indian Forest Service 2025 Notification : ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2025.. ప్రిలిమ్స్‌కు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పుడు?
➔ అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
➔ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎంపిక ప్రక్రియ మూడంచెలుగా జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.
➔ ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1(జనరల్ స్టడీస్)–100 మార్కులు; పేపర్–2 (సబ్జెక్ట్ పేపర్)–300 మార్కులకు నిర్వహిస్తారు. తొలిదశ ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించి ఒక్కో సబ్జెక్ట్‌కు మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
➔ మెయిన్ ఎగ్జామినేషన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ (200 మార్కులు) నిర్వహిస్తారు.
Tags
- Combined Geo Scientist
- UPSC
- UPSC jobs
- job calender 2025
- prelims and mains exams
- Union Ministry of Mines
- Ministry of Water Resources
- Specialized jobs
- Combined Geo Scientist notification
- Eligible Candidates
- Government Jobs
- upsc civils services exam
- UPSC Combined Geo Scientist Prelims Notification
- UPSC Combined Geo Scientist exams
- Education News
- Sakshi Education News
- UPSCRecruitment
- MinistryOfMines
- WaterResourcesMinistry
- GovernmentJobs
- SpecializedPosts
- UPSCJobs
- SelectionProcess
- CentralGovernmentJobs
- MinistryVacancies
- UPSCSelection
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications