Civil Engineering: ఈ రంగంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పాత్ర కీలకం

తాడేపల్లిగూడెం: నిర్మాణ రంగంలో ఆధునిక సివిల్‌ ఇంజనీరింగ్‌ పాత్ర ఎంతో కీలకమైందని బిట్స్‌ పిలానీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యులు డాక్టర్‌ ఏ.బెహరుద్దీన్‌ సూచించారు. ఏపీ నిట్‌లో ఆధునిక నిర్మాణ వస్తువులు , అభ్యాసాల ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలు అంశంపై వారం రోజులుగా నిర్వహిస్తున్న వర్కుషాపు ఆదివారం ముగిసింది. బెహరుద్దీన్‌ మాట్లాడుతూ నిర్మాణ రంగం శ్రమతో కూడుకున్న పని అయినప్పటికి సరైన ప్రణాళికతో ముందు కెళ్తే సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రత్యేకమైన డిజైన్లు, ఖచ్చితమైన అధ్యయనాలతో వాటిని అధిగమించవచ్చన్నారు. నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ పి.శంకరరెడ్డి, డాక్టర్‌ ఎస్‌.భరణీధరణ్‌, ఎస్‌ఎం.సుభానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Competitive Exams Free Coaching: సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆహ్వానం

#Tags