10 Lac Central Government Jobs : గుడ్‌ న్యూస్‌.. దేశ వ్యాప్తంగా త్వరలోనే 10 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి కీల‌క ఆదేశాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో నిరుద్యోగితపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పోస్టుల భర్తీపై కేంద్రం ప్ర‌భుత్వం మరింతగా దృష్టి పెడుతోంది.

ఇందులో భాగంగా ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) సూచించింది. వాటిని సత్వరం భర్తీ చేసేందుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించింది. 

ద‌వండి: Railway Jobs: తూర్పు రైల్వేలో 3115 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంట్రీ స్థాయితో పాటు సీనియర్‌ లెవెల్‌ ఖాళీల వివరాలను కూడా కేంద్రం అడిగినట్లు ఒక పీఎస్‌యూ సీనియర్‌ అధికారి తెలిపారు. డిసెంబర్‌ వరకు గుర్తించిన ఎంట్రీ–లెవెల్‌ ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు.

దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో..
సాధారణంగా నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉండటం, దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం వంటి అంశాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హైరింగ్‌ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

అధికారిక గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇవి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.89 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి.

ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలకు..
వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల మంది ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలు, విభాగాలకు జూన్‌లో ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రకటనలు జారీ చేయడం కూడా మొదలుపెట్టాయి. 2012–13లో పీఎస్‌బీల్లో 8.86 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2020–21 నాటికి ఇది 7.80 లక్షలకు తగ్గింది.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

#Tags