10th Class & 12th Class Exams: పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు... ఇక ఏడాదికి రెండుసార్లు

రాయ్‌పూర్‌: ఏడాదికి ఒక్కసారి మాత్రమే సీబీఎస్‌ఈ పదో, 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరు తీవ్ర పరీక్షల ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఇకపై ఏడాదికి రెండు సార్లు ఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని 211 పాఠశాలలను పీఎం శ్రీ(స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం కింద నవీకరించే పథకాన్ని మంగళవారం రాయ్‌పూర్‌లో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడారు. ‘‘ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులపై అకడమిక్‌ ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఇకపై ఏడాదికి రెండుసార్లు పది, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాయొచ్చు.

చదవండి: School Education Reforms: ఇక పై ఈ ప్రభుత్వ పాఠశాలల్లో CBSE ఇంగ్లీష్ మీడియం!

రెండుసార్లు రాస్తే రెండింటి ఫలితాల్లో అధిక స్కోరు సాధించిన వాటినే లెక్కలోకి తీసుకుంటారు.   విద్యార్థులకు మరింతగా ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యే సమయం, అవకాశం లభిస్తుంది. వారిపై పరీక్షల ఒత్తిడి సైతం తగ్గుతుంది. 2025–26 విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలుచేస్తాం’’ అని ఆయన అన్నారు. అయితే, ఈ బోర్డు పరీక్షలు తొలి దఫా 2024 నవంబర్‌–డిసెంబర్‌లో, రెండో దఫా 2025 ఫిబ్రవరి–మార్చిలో జరుగుతాయని కేంద్ర విద్యా శాఖలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

చదవండి: 10th & 12Th Class: సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలు ఖరారు

తాజా నిర్ణయంపై విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ‘‘విద్యార్థి ఒకవేళ మొదటి దఫా పరీక్షలోనే తాను అద్భుతంగా రాశానని భావిస్తే రెండో దఫాలో పరీక్ష రాయాలా వద్దా అనేది అతని ఇష్టమే. కచ్చితంగా రెండోసారి రాసి తీరాలనే నిబంధన లేదు’’ అని ఆయన చెప్పారు. 

#Tags