ఐఐఎం ప్లేస్‌మెంట్స్..కార్పొరేట్ హవా
కార్పొరేట్ రంగంలో ఐఐఎంలపై క్రేజ్ మరోమారు స్పష్టమైంది! బహుళ జాతి సంస్థలు ఐఐఎం విద్యార్థుల కోసం క్యూ కట్టాయి. రూ.లక్షల వేతనాలతో ఎర్రతివాచీ పరిచాయి.
ఐఐఎంల్లో ఇటీవల ముగిసిన చివరి ప్లేస్‌మెంట్స్ గణాంకాలు ఇందుకు నిదర్శనం! ఈ నేపథ్యంలో విద్యార్థులకు లభించిన ఆఫర్లు, వేతన ప్యాకేజీలు తదితరాలపై ఫోకస్..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు).. మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలో అత్యున్నత విద్యా సంస్థలుగా గుర్తింపు సాధించాయి. కార్పొరేట్ కంపెనీలకు నిపుణులైన అభ్యర్థులను అందిస్తున్న విద్యాసంస్థలుగా పేరు గడించాయి. ఐఐఎం అనగానే గుర్తొచ్చే ఐఐఎం-అహ్మదాబాద్ మొదలు.. ఇటీవల ఏర్పాటైన కొత్త ఐఐఎం క్యాంపస్‌ల వరకు.. అన్నింటిలోనూ దాదాపు 100 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. విద్యార్థులకు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు లభించాయి.
ప్రఖ్యాత ఐఐఎంల జోరు
ఐఐఎం-అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, లక్నో.. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్నాయి. ఈ ఏడాదీ వీటిలో కొలువుల జోరు కొనసాగింది. ఈ క్యాంపస్‌ల్లో 100 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. 2017 డిసెం బర్ నుంచి 2018 ఫిబ్రవరి చివరి వరకు సాగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో మొదటి దశలోనే 60 శాతం మందికి ఆఫర్లు లభించాయి. చివరి దశ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ లో మిగిలిన వారికీ నియామక పత్రాలు చేతికందాయి.
ఒకట్రెండు రోజుల్లోనే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు).. మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలో అత్యున్నత విద్యా సంస్థలుగా గుర్తింపు సాధించాయి. కార్పొరేట్ కంపెనీలకు నిపుణులైన అభ్యర్థులను అందిస్తున్న విద్యాసంస్థలుగా పేరు గడించాయి. ఐఐఎం అనగానే గుర్తొచ్చే ఐఐఎం-అహ్మదాబాద్ మొదలు.. ఇటీవల ఏర్పాటైన కొత్త ఐఐఎం క్యాంపస్‌ల వరకు.. అన్నింటిలోనూ దాదాపు 100 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. విద్యార్థులకు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు లభించాయి.
ప్రఖ్యాత ఐఐఎంల జోరు
ఐఐఎం-అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, లక్నో.. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్నాయి. ఈ ఏడాదీ వీటిలో కొలువుల జోరు కొనసాగింది. ఈ క్యాంపస్‌ల్లో 100 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. 2017 డిసెం బర్ నుంచి 2018 ఫిబ్రవరి చివరి వరకు సాగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో మొదటి దశలోనే 60 శాతం మందికి ఆఫర్లు లభించాయి. చివరి దశ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ లో మిగిలిన వారికీ నియామక పత్రాలు చేతికందాయి.
ఒకట్రెండు రోజుల్లోనే..
- చివరి ప్లేస్‌మెంట్స్‌లో తుది దశ డ్రైవ్స్ ఒకట్రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.
- ఐఐఎం- కోల్‌కతాలో రెండు రోజుల్లో 481 ఆఫర్లతో 100 శాతం రికార్డు నమోదైంది. ఐఐఎం బెంగళూరులోనూ ఇదే పరిస్థితి. మొత్తం 420 మంది విద్యార్థులకు 462 ఆఫర్లు లభించాయి.
- ఐఐఎం లక్నోలో 445 మంది విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 454 ఆఫర్లు ఖరారయ్యాయి.
- ఐఐఎం-అహ్మదాబాద్‌లో క్లస్టర్ విధానం అమల వుతోంది. మూడు క్లస్టర్లలోని విద్యార్థులందరికీ క్యాంపస్ డ్రైవ్స్‌లో నియామకాలు ఖరారయ్యా యి. ఐఐఎం- అహ్మదాబాద్ ట్రేడ్ మార్క్ ప్రోగ్రా మ్.. ‘ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్’ లోనూ అధిక ఆఫర్లు లభించాయి.
- ఇటీవల ఏర్పాటై, కొత్త ఐఐఎంలుగా పేర్కొంటున్న రాంచీ, రాయ్‌పూర్, ఉదయ్‌పూర్, విశాఖపట్నం తదితరాల్లోనూ 100 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదవడం విశేషం.
- గతంలో ఐఐఎంల గడప తొక్కని సంస్థలూ ఈసారి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టడం విశేషం. ఐఐఎం-లక్నో క్యాంపస్‌లో 47 సంస్థలు, ఐఐఎం-అహ్మదాబాద్‌లో 30, కోల్‌కతాలో 42 సంస్థలు ఈ ఏడాదే కొత్తగా వచ్చాయి.
గతేడాదితో పోల్చితే..!
క్యాంపస్ డ్రైవ్స్ ఆఫర్ల ఖరారులో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం మంచి పెరుగుదల కనిపించింది. ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో, ఉదయ్‌పూర్ తదితర క్యాంపస్‌ల్లో 20 శాతం పెరుగుదల నమోదైంది. 10 శాతం మంది విద్యార్థులకు రెండేసి ఆఫర్లు సైతం లభించాయి. ఐఐఎం లక్నోలో ఏడుగురు విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు అందాయి.
బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్
క్యాంపస్ డ్రైవ్స్ గణాంకాలను పరిశీలిస్తే.. అన్ని ఐఐఎం క్యాంపస్‌ల్లోనూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), కన్సల్టింగ్ సంస్థల హవా కనిపించింది. యాక్సెంచర్ స్ట్రాటజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే అండ్ కో తదితర ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలు; సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐసీఐసీఐ బ్యాంకులు ముందంజలో నిలిచాయి. సగటున ప్రతి ఐఐఎంలోనూ 40 శాతం మేరకు ఆఫర్లు ఇచ్చాయి.
ఐటీ సంస్థలు..
ఐఐఎం క్యాంపస్ డ్రైవ్స్‌లో ఐటీ సంస్థలూ భారీ ఆఫర్లు ఇవ్వడం విశేషం. అన్ని ఐఐఎంలలో కలిపి సగటున 30 శాతం మేర ఐటీ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఈ సంస్థలు ప్రధానంగా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్, బిగ్‌డేటా విభాగాలకు అభ్యర్థులను నియమించుకున్నాయి. కనిష్టంగా రూ.25 లక్షలు, గరిష్టంగా రూ.40 లక్షలు, సగటున రూ.28 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్లు అందించాయి.
పీపీవోలకు ప్రాధాన్యం
- 2016-18 బ్యాచ్‌కు సంబంధించి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ పరంగా తమ సంస్థల్లో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (పీపీవో) సొంతం చేసుకొని ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో సంస్థలు ప్రాధాన్యం ఇచ్చాయి. ఆయా సంస్థలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో.. పీపీవో అభ్యర్థుల సంఖ్య 60 శాతం వరకు ఉన్నట్లు క్యాంపస్ వర్గాలు పేర్కొన్నాయి.
- 2017-19 బ్యాచ్ ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (సమ్మర్ ఇంటర్న్స్)లోనూ పెరుగుదల నమోదైంది. ఒకట్రెండు నెలల వ్యవధిలో ఉండే ప్రీ ప్లేస్‌మెంట్స్ పరంగా గతేడాదితో పోల్చితే.. ఈ సంవత్సరం అన్ని ఐఐఎంలలో 20 శాతం పెరుగుదల కనిపించింది. రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్ ఇచ్చేందుకు సంస్థలు సిద్ధమవడం విశేషం.
పెరుగుదలకు కారణం
పీపీవో సొంతం చేసుకున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ సమయంలో సమర్థంగా రాణించడమే ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్లు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు సంస్థలు విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ... యంగ్, డైనమిక్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవాలని చూడటమూ మరో కారణంగా చెబుతున్నారు.
టాప్ రిక్రూటర్స్
- బెయిన్ అండ్ కంపెనీ
- యాక్సెంచర్ ఎ.టి.కెర్నీ
- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్
- బ్యాంక్ ఆఫ్ అమెరికా
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయంగా సంస్థలు కార్యకలాపాలు, ప్రణాళికల పరంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దాంతో ఈసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కంపెనీలన్నీ యువత కోసం అన్వేషిస్తున్నాయి. యువ ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా చురుగ్గా పనిచేస్తారనే నమ్మకం కంపెనీల్లో ఉంది. ఈ సంవత్సరం భారత్‌లోనూ ఆయా సంస్థల కార్యకలా పాలు పెరిగే అవకాశం ఉంది. క్యాంపస్ డ్రైవ్స్‌లో పెరుగుదల ఇందులో భాగమే.
- తపస్ రంజన్, మేనేజర్, కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐఎం-వి.
#Tags