IGNOU: ఇగ్నోలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు

ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఆధ్వర్యంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ విశాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు ఒక ప్రకటనలో తెలిపారు.

మల్టీ డిసిప్లినరీ కోర్సుగా ఇగ్నో ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందిస్తుందన్నారు. నాలుగేళ్ల ఈ డిగ్రీ కోర్సులో 8 సెమిస్టర్లు, 180 క్రెడిట్లు ఉంటాయన్నారు. మల్టీ డిసిప్లినరీ విధానంలో అందిస్తున్న ఈ కోర్సులో బీఏ, బీఎస్‌సీ, బీకాం కోర్సుల్లో అన్ని స్పెషలైజేషన్‌ సబ్జెక్టుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

విద్యార్జనకు దగ్గర చేసే దూరవిద్య!

#Tags