సాయుధ దళాల్లో ‘భద్రతా’ ఉద్యోగం: CAPF AC పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్!

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)
కేంద్ర హోంశాఖ పరిధిలో దేశ అంతర్గత, సరిహద్దు భద్రత బాధ్యతలు నిర్వహించే కీలక విభాగం CAPF (Central Armed Police Forces). బ్యాచిలర్ డిగ్రీతో అసిస్టెంట్ కమాండెంట్ (AC) ఉద్యోగం పొందే అవకాశం ఉంది. యూపీఎస్సీ (UPSC) CAPF AC 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో CAPF AC పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
CAPF AC 2025: 5 విభాగాల్లో 357 పోస్టులు
CAPF AC పరీక్ష ద్వారా 5 విభాగాల్లో మొత్తం 357 పోస్టులు భర్తీ చేయనున్నారు.
- BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్): 24 పోస్టులు
- CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్): 204 పోస్టులు
- CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్): 92 పోస్టులు
- ITBP (ఇండో–టిబెటిన్ పోలీస్ ఫోర్స్): 04 పోస్టులు
- SSB (సశస్త్ర సీమా బల్): 33 పోస్టులు
అర్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి.
- చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంది.
చదవండి: 10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
మూడుది దశల ఎంపిక ప్రక్రియ:
CAPF AC పరీక్ష మొత్తం మూడు దశల్లో జరుగుతుంది:
- రాత పరీక్ష
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ
రాత పరీక్ష విధానం:
CAPF AC రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి:
పేపర్–1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్
మొత్తం ప్రశ్నలు: 125
మార్కులు: 250
పరీక్ష మాధ్యమం: ఆబ్జెక్టివ్ విధానం (మల్టిపుల్ ఛాయిస్)
నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత.
సమయం: 2 గంటలు
పేపర్–2: జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్
మొత్తం మార్కులు: 200
పరీక్ష మాధ్యమం: డిస్క్రిప్టివ్ విధానం
సమయం: 3 గంటలు
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET):
రాత పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు PET నిర్వహిస్తారు.
ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా:
100 మీటర్ల పరుగు: పురుషులు – 16 సెకన్లు, మహిళలు – 18 సెకన్లు
800 మీటర్ల పరుగు: పురుషులు – 3 నిమిషాలు 45 సెకన్లు, మహిళలు – 4 నిమిషాలు 45 సెకన్లు
లాంగ్‌జంప్: పురుషులు – 3.5 మీటర్లు, మహిళలు – 3 మీటర్లు (గరిష్టంగా 3 ప్రయత్నాలు)
షాట్‌పుట్ (7.26 కేజీలు): పురుషులు – 4.5 మీటర్లు
పర్సనల్ ఇంటర్వ్యూ:
రాత పరీక్ష, PETలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
మొత్తం మార్కులు: 150
అభ్యర్థిలో సాయుధ దళాల్లో విధులు నిర్వహించే నైపుణ్యాలు, లీడర్‌షిప్ గుణాలు, ప్రామాణికతను పరిశీలిస్తారు.
గ్రూప్–A గెజిటెడ్ హోదా:
తుది మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు గ్రూప్–A గెజిటెడ్ హోదాలో ఉద్యోగం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు సుమారు ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది.
CAPF AC 2025 ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జనవరి 25
దరఖాస్తు చివరి తేదీ: 2025 మార్చి 25
సవరించేందుకు అవకాశం: 2025 మార్చి 26 - ఏప్రిల్ 1
రాత పరీక్ష తేదీ: 2025 ఆగస్ట్ 3
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
ఆధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in
రాత పరీక్షలో రాణించేలా
- పేపర్–1లో మంచి మార్కులు సా ధించాలంటే.. ముందుగా సిలబస్ లో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీ ఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడు తుంది.
- కరెంట్ అఫైర్స్ కోసం ఆర్థిక–రాజకీయ పరిణా మాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది.
వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి
- ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభా గాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ– భద్ర తకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చు కున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మరింత మేలు చేస్తుంది.
- పేపర్–2లో రాణించాలంటే.. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు తోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతిరోజు రెండు గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై తర్ఫీదు పొందాలి.
60 శాతం మార్కులు
మొత్తం ఆరు వందల మార్కులకు (రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 150 మార్కులు) జరిగే ఎంపిక ప్రక్రియలో 50 శాతం మార్కులు సాధిస్తే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నిర్దేశిత ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత పొందితే విజేతల జాబితాలో నిలిచి సర్వీస్ సొంతం చేసుకోవచ్చు.