మెరిసే కెరీర్‌కు వేదికలు...ఎంఎన్‌సీ బ్యాంకులు
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగం అంటే ఎంట్రీ లెవల్లో క్లరికల్ లేదా పీఓ స్థాయితో కెరీర్ ప్రారంభించొచ్చు.
కానీ..ఎంఎన్‌సీ(మల్టీ నేషనల్ కంపెనీ) బ్యాంకులు, ఇతర ప్రైవేటు బ్యాంకుల్లో కొలువు కోసం ఆయా బ్యాంకులు వేర్వేరుగా చేపట్టే నియామక ప్రక్రియల్లో విజయంసాధించాల్సిందే. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పోల్చితే.. ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో జాబ్ ప్రొఫైల్స్, కెరీర్ అవకాశాలపై అభ్యర్థులకు సందేహాలు అనేకం. ఇటీవల కాలంలో దేశంలో ఎంఎన్‌సీ బ్యాంకుల విస్తరణతోపాటు ఉద్యోగావకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎంఎన్‌సీ బ్యాంకుల్లో కొలువు సాధన గురించి తెలుసుకుందాం...
విభిన్న హోదాలు..
ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో ఎంట్రీ లెవల్లో విభిన్న హోదాలతో ఖాళీలు ఉంటున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్(క్లర్క్ కేడర్)గా పేర్కొనే పోస్టులను.. ఎంఎన్‌సీ బ్యాంకులు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్/కస్టమర్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పేర్కొంటున్నాయి. ఈ పోస్టుల్లోకి నియామకాల కోసం సొంతంగా తమ వెబ్‌సైట్స్‌లో ప్రకటనలివ్వడంతోపాటు జాబ్ పోర్టల్స్‌తో ఒప్పందాల ద్వారా తమకు సరిపడే అభ్యర్థులను గుర్తిస్తున్నాయి. వారికి కొంతకాలం శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
స్పెషలైజ్డ్ ఉద్యోగాలు :
ఎంఎన్‌సీ బ్యాంకులు బ్యాక్ ఎండ్‌లో కీలకంగా భావించే స్పెషలైజ్డ్ ఉద్యోగాలకు తరచూ నియామకాలు జరుపుతున్నాయి. ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్, ట్యాక్సేషన్ మేనేజర్, మేనేజర్-న్యూప్రొడక్ట్స్ వంటి హోదాలతో జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈ కొలువులు సొంతం చేసుకోవాలంటే.. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో అకడమిక్‌గా కనీసం పీజీ పూర్తిచేసుండాలి. అలాగే ట్యాక్సేషన్, ఇంటర్నల్ ఆడిట్ తదితర విభాగాల్లో మేనేజర్స్ వంటి పోస్ట్‌ల కోసం సీఏ కోర్సు ఉత్తీర్ణతను అదనపు అర్హతగా పరిగణిస్తూ వారికి పెద్దపీట వేస్తున్నాయి.
టెక్నికల్ జాబ్స్ :
ఎంఎన్‌సీ బ్యాంకులు నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలతోపాటు టెక్నికల్ జాబ్స్‌ను కూడా అందిస్తున్నాయి. అధిక శాతం బ్యాంకులు నెట్ వర్కింగ్ లీడ్, జావా లీడ్, ఐటీ మేనేజర్స్ వంటి కొలువులను సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులతో భర్తీ చేస్తున్నాయి. వీటిల్లో చేరిన ఉద్యోగులు బ్యాంకు అనుసరిస్తున్న సాఫ్ట్‌వేర్ విధానాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వాటి అప్లికేషన్ ప్రాసెస్‌పై బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఎంఎన్‌సీ బ్యాంకులు కేవలం కస్టమర్ సర్వీస్, ఐటీ సర్వీస్ వంటివే కాకుండా.. బిజినెస్ కార్యకలాపాల విస్తరణ పరంగా అనలిస్ట్‌లకు సైతం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయి. డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, టెక్నికల్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు కీలకంగా మారాయి.
మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు పెద్దపీట :
క్షేత్ర స్థాయిలో కార్యకలాపాల పరంగా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ.. కీలకమైన విభాగాల్లో ఎంఎన్‌సీలు మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు ఎంఎన్‌సీ బ్యాంకులు ఐఐఎంలు, ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించి.. సగటున రూ.15లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్స్ అందిస్తున్నాయి.
ఆకర్షణీయ వేతనాలు..
ఎంఎన్‌సీ బ్యాంకుల్లో వేతనాలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. క్లరికల్ కేడర్‌లో సగటున రూ.ఐదు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉండి.. ఫోన్ బ్యాంకింగ్ రిలేషన్స్ విభాగంలో చేరిన వారు కనీసం రూ.మూడు లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు.
ప్రైవేటు బ్యాంకుల్లో..
దేశంలోని పలు ప్రైవేట్ బ్యాంకులు తమదైన సొంత ప్రక్రియ ద్వారా నియామకాలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి పోస్ట్‌ల భర్తీ కోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నాయి. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత ద్వారా ఆయా కోర్సులకు అభ్యర్థులను ఎంపికచేసి.. సమర్థ వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికే పీవో హోదాలో అవకాశం కల్పిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు సహా పలు ప్రైవేటు బ్యాంకులు ఈ విధానంలోనే పీఓ స్థాయి ఉద్యోగాల ఎంపిక చేపడుతున్నాయి.
విధి నిర్వహణ :
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చుకుంటే.. ఎంఎన్‌సీ బ్యాంకుల్లో విధి నిర్వహణలో ఒత్తిడి కొంత ఎక్కువే అని చెప్పొచ్చు. నిరంతరం బృంద సమావేశాలు, లక్ష్యాలు నిర్దేశించడం, వాటిని పూర్తి చేసే క్రమంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొన్ని బ్యాంకుల్లో టార్గెట్స్ చేరుకోలేని వారికి ఎప్పుడైనా ఉద్వాసన పలికే పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు.
ప్రతిభ ఉంటే..
ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో విధి నిర్వహణ పరంగా చురుగ్గా వ్యవహరిస్తూ, మంచి ప్రతిభ చూపితే వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పదోన్నతుల పరంగా నిర్దిష్టంగా విధి విధానాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓగా కెరీర్ ప్రారంభించిన వారు ఏజీఎం/జీఎం స్థాయికి చేరుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుంది. కానీ..ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్లలోనే పనితీరు ఆధారంగా చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకునే వీలుంది.
నైపుణ్యాలివే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంఎన్‌సీ బ్యాంకులు ఔత్సాహిక ఉద్యోగార్థుల నుంచి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కోరుకుంటున్నాయి. అవి..
స్వీయ అన్వేషణే సాధనం :
ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో అవకాశాల కోసం స్వీయ అన్వేషణపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని ఎంఎన్‌సీ బ్యాంకులు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించినా... కింది స్థాయి పోస్టులకు మాత్రం ఆ విధానం అమల్లో లేదు. కాబట్టి ఖాళీల సమాచారం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలోని కెరీర్స్/రిక్రూట్‌మెంట్స్ లింక్స్‌ను నిరంతరం చూస్తుండాలి. అదే విధంగా ఎంఎన్‌సీ బ్యాంకు ఉద్యోగాలను ప్రాథమ్యంగా పేర్కొంటూ జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఆయా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత బ్యాంకు నియామక విధానానికి అనుగుణంగా సన్నద్ధమై ఎంపిక ప్రక్రియలో పాల్గొనొచ్చు.
ఎంఎన్‌సీ బ్యాంక్ జాబ్... సానుకూలాంశాలు
ఎంఎన్‌సీ బ్యాంకుల ఉద్యోగాలు.. ప్రతికూలతలు

- సాఫ్ట్ స్కిల్స్
- ఇంటర్ పర్సనల్ స్కిల్స్
- మల్టీ కల్చరల్ స్కిల్స్
- ఇంగ్లిష్ స్పీకింగ్
- టీమ్ లీడింగ్
- స్ట్రెస్ మేనేజ్‌మెంట్
- డెసిషన్ మేకింగ్ ట్రబుల్ షూటింగ్
స్వీయ అన్వేషణే సాధనం :
ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో అవకాశాల కోసం స్వీయ అన్వేషణపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని ఎంఎన్‌సీ బ్యాంకులు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించినా... కింది స్థాయి పోస్టులకు మాత్రం ఆ విధానం అమల్లో లేదు. కాబట్టి ఖాళీల సమాచారం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలోని కెరీర్స్/రిక్రూట్‌మెంట్స్ లింక్స్‌ను నిరంతరం చూస్తుండాలి. అదే విధంగా ఎంఎన్‌సీ బ్యాంకు ఉద్యోగాలను ప్రాథమ్యంగా పేర్కొంటూ జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఆయా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత బ్యాంకు నియామక విధానానికి అనుగుణంగా సన్నద్ధమై ఎంపిక ప్రక్రియలో పాల్గొనొచ్చు.
ఎంఎన్‌సీ బ్యాంక్ జాబ్... సానుకూలాంశాలు
- కెరీర్ పరంగా ప్రతిభ చూపితే వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.
- సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌తో విధుల్లో మెరుగ్గా రాణించి ఉన్నతాధికారులను మెప్పించే అవకాశం.
- కెరీర్ ప్రారంభంలో ఎంట్రీ లెవల్ హోదాల్లో సగటున రూ.5లక్షలు.. టెక్నికల్, మేనేజీరియల్ స్థాయి పోస్టులకు సగటున రూ.15 లక్షల వార్షిక వేతనం అందుకునే వీలుంది.
- బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి నేపథ్యంలో పెరుగుతున్న ఎంఎన్‌సీ బ్యాంకుల కార్యకలాపాలు.
- ప్రతి ఏటా ఇరవై వేలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఎంఎన్‌సీ, ప్రైవేటు బ్యాంకులు.
ఎంఎన్‌సీ బ్యాంకుల ఉద్యోగాలు.. ప్రతికూలతలు
- ఒత్తిడితో కూడిన పని వాతావరణం. నిరంతర సమావేశాలు.. టార్గెట్స్, డెడ్‌లైన్స్.
- 24×7 పనివాతావరణంలో విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి.
- ఉద్యోగ అభద్రత
- ప్రభుత్వ బ్యాంకులతో పోల్చితే ఇతర సదుపాయాలు, అలవెన్స్‌లు కొంత తక్కువ.
ఈ నైపుణ్యాలుంటే.. ప్రస్తుతం ఎంఎన్‌సీ బ్యాంకులు విస్తరిస్తూ నిరుద్యోగులకు ఉపాధి వేదికలుగా మారుతున్నాయి. ఉద్యోగ భద్రత, విధి నిర్వహణ పరంగా కొన్ని అపోహలు కూడా నెలకొంటున్నాయి. సాఫ్ట్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్(ఒత్తిడి నిర్వహణ) నైపుణ్యాలుంటే సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి నిర్వహణ నైపుణ్యం ద్వారా ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సునాయాసంగా పనిచేసుకుపోవచ్చు. ఈ నైపుణ్యం ఉన్నత స్థానాలు చేరుకునేందుకు ఒక సాధనంగానూ ఉపయోగపడుతుంది. అంతేకాని..ఎంఎన్‌సీ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో రాణించడం కష్టం అనే అభిప్రాయం సరికాదు. - ఎస్.రాధాకృష్ణారెడ్డి, క్లస్టర్ హెడ్, రిటైల్ అగ్రి బిజినెస్, హెచ్‌డీఎఫ్‌సీ |
#Tags