TS Budget Updates: జూలై 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జూలై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
జూలై 25వ తేదీ తెలంగాణ ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అసెంబ్లీ సెక్రటరీ జూలై 19(గురువారం)వ తేదీ జారీ చేశారు.
జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌ను విడుదల చేయటం వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
BUDGET Update: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. బడ్జెట్‌లో ఆ ప్రకటన ప్రకటించే అవకాశం.. ఏదంటే..?
#Tags