Budget 2024-25 Live Updates: కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్ సమావేశాల అప్‌డేట్స్ ఇవే..

బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..

  • బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.

  • బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్‌ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్‌-మే వరకు అమలు అవుతుంది.

  • 2020, ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో  రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.

  • మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.

  • సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.

  • ఈరోజు బడ్జెట్‌ సమావేశాల్లో జమ్ము కశ్వీర్‌ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.

రాష్ట్రపతితో సమావేశమైన ఆర్థిక మంత్రి..

  • పార్లమెంటులో జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.

  • జమ్మూకశ్మీర్‌ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.

  • నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.

  • కొవిడ్‌ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్‌లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్‌లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.

  • బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈ రోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

  • దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.

  • ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.

వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?

  • ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్‌లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.

  • వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.

  • వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.

  • పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.

  • వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.

  •  

    వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

#Tags