ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2013-14
2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18న శాసనసభకు సమర్పించారు. ‘‘ప్రజాస్వామ్యం అంటే అత్యంత బలహీనుడు సైతం అత్యంత బలవంతునితో సమానంగా అవకాశాలు పొందడమే’’ అన్న గాంధీ స్పూర్తిని గుర్తు చేసుకుంటూ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 1,61,348 కోట్ల బడ్జెట్‌లో ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్) రూ. 24,487 కోట్లుగా ఉండనుంది. రాష్ర్ట ప్రభుత్వం మొత్తం అప్పు రూ. 1,79,637 కోట్లు. సగటున ఒక్కొక్కరిపై రూ. 21,159 రుణభారం పడుతుంది. ప్రభుత్వం వ్యాట్ ద్వారా రూ. 52 వేల కోట్లు ఆర్జించాలని నిర్ణయించింది. ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయానికి ‘వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక’ పేరిట 25,962 కోట్ల నిధులు కేటాయించారు. సమసమాజ స్థాపనే లక్ష్యమంటూ మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఈ నేపథ్యంలో.. బడ్జెట్ సమగ్ర స్వరూపం మీ కోసం..
బడ్జెట్ స్వరూపం(రూ.కోట్లలో)
బడ్జెట్ స్వరూపం(రూ.కోట్లలో)
అంశం | మొత్తం |
బడ్జెట్ మొత్తం | 1,61,348 |
ప్రణాళికేతర వ్యయం | 1,01,926 |
ప్రణాళికావ్యయం | 59,422 |
కేంద్ర రాష్ర్ట పన్నులు, గ్రాంట్లు, | 1,27,772.19 |
పన్నేత ర రెవన్యూ రాబడి ప్రజా రుణం | 33,229.69 |
రుణాల రికవరీ ద్వారా రాబడి | 462.91 |
పబ్లిక్ అకౌంట్స్ | 267.04 |
మొత్తం రెవెన్యూ రాబడులు | 1,61,731.83 |
రెవెన్యూ వ్యయం | 1,26,794.41 |
కేపిటల్ వ్యయం | 21,278.50 |
ప్రజా రుణం తిరిగి చెల్లింపు | 8,626.68 |
రుణాలు, అడ్వాన్స్‌లు | 4,694.10 |
మొత్తం వ్యయం | 1,61,348.69 |
నికర నిల్వ | 383.14 |
బడ్జెట్ ప్రధానాంశాలు
- ప్రభుత్వానికి అన్ని రకాల రెవెన్యూ రాబడులు రూ. 1,27,772.19 కోట్లుగా అంచనా వేశారు.
- ప్రభుత్వం సొంత పన్నుల ద్వారా రూ. 72,442 కోట్లు ఆర్జించనుంది. ఒక్క వ్యాట్ ద్వారానే రూ. 52 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుత ఏడాది కంటే ఇది రూ.10 వేల కోట్లు ఎక్కువ.
- వ్యవసాయానికి రూ. 25,962 కోట్లు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయం వాటా 3.80 శాతం మాత్రమే.
- త్వరలోనే 18 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మరో 52 కొత్త మండలాలు రూపుదిద్దు కుంటాయి.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో అప్పుల వాటా రూ.24,248 కోట్లు. దీంతో రాష్ట్ర రుణం రూ.1,79,637.51 కోట్లకు చేరింది.
- ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రూ. 4,282 కోట్లు కేటాయించారు.
- పరిశ్రమలకు రూ. 1,119.72 కోట్లు కేటాయించారు.
- సంక్షేమ శాఖలకు రూ.14 వేల కోట్ల నిధులు అందించనున్నారు. ఇది గత ఏడాది కంటే రూ.4 వేల కోట్లు ఎక్కువ
- ప్రస్తుత వార్షిక ప్రణాళికకు రూ.44,959 కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.3,975 కోట్లు తక్కువ.
- తాజా బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.13,804 కోట్లు కేటాయించారు.
- ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం రూ.140 కోట్లు ప్రకటించింది.
- వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 10 లక్షల 32 వేల 757 మంది.
- పౌర సరఫరాలకు రూ.3,231 కోట్లు కేటాయించారు.
- తాజా బడ్జెట్‌లో క్రీడలకు 206.88 కోట్లు ప్రకటించారు.
- ఆరోగ్యానికి ఈ ఏడాది రూ.6,481 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది రూ.5,889 కోట్లు
ముఖ్యమైన కేటాయింపులు-సమగ్ర వివరాలు
వ్యవసాయానికి రూ. 25,962 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 4.01(రూ.5,605 కోట్లు) శాతం ఉండగా, అది వచ్చే ఏడాదిలో (2013-14) 3.08 (రూ.6,127) శాతానికి తగ్గింది. 2013-14 బడ్జెట్‌లో రైతులకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ చెప్పుకోదగ్గ మేలు చేసే అంశాలేమీ లేవని వ్యవసాయ రంగ నిపుణులు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు.
రుణపరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ పరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లుగా పేర్కొన్నారు. రూ.72 వేల కోట్ల రుణాల్లో కనీసం రూ.60 వేల కోట్లయినా పంట రుణాలు ఉంటాయి. రూ.60 వేల కోట్లకు 4 శాతం వడ్డీ చొప్పున బ్యాంకు రుణాలకు వడ్డీ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.2,400 కోట్లు అవుతుంది. అయితే వడ్డీలకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు.
‘ఆలంబన’కు రూ. 100 కోట్లు
ప్రస్తుత బడ్జెట్‌లో కొత్త అంశం ‘మార్కెట్ ఆలంబన నిధి’. రైతుకు కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు కేటాయించిన నిధి ఇది. ఈ నిధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులివీ..
వ్యవసాయానికి రూ. 25,962 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 4.01(రూ.5,605 కోట్లు) శాతం ఉండగా, అది వచ్చే ఏడాదిలో (2013-14) 3.08 (రూ.6,127) శాతానికి తగ్గింది. 2013-14 బడ్జెట్‌లో రైతులకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ చెప్పుకోదగ్గ మేలు చేసే అంశాలేమీ లేవని వ్యవసాయ రంగ నిపుణులు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు.
రుణపరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ పరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లుగా పేర్కొన్నారు. రూ.72 వేల కోట్ల రుణాల్లో కనీసం రూ.60 వేల కోట్లయినా పంట రుణాలు ఉంటాయి. రూ.60 వేల కోట్లకు 4 శాతం వడ్డీ చొప్పున బ్యాంకు రుణాలకు వడ్డీ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.2,400 కోట్లు అవుతుంది. అయితే వడ్డీలకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు.
‘ఆలంబన’కు రూ. 100 కోట్లు
ప్రస్తుత బడ్జెట్‌లో కొత్త అంశం ‘మార్కెట్ ఆలంబన నిధి’. రైతుకు కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు కేటాయించిన నిధి ఇది. ఈ నిధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులివీ..
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు
- సోలార్ విద్యుత్‌కు రూ.150 కోట్లు
- సబ్సిడీపై విత్తన సరఫరాకు రూ.308 కోట్లు
- జాతీయ వ్యవసాయ బీమా పథకానికి రూ.410 కోట్లు
- వడ్డీలేని రుణాలకు రూ.500 కోట్లు, పావలా వడ్డీకి రూ.60 కోట్లు
- వర్షాధార వ్యవసాయాభివృద్ధికి రూ.2903.50 కోట్లు
- ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.517.42 కోట్లు
- పశుసంవర్ధక శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.269.57 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.654.58 కోట్లు.
- మత్స్య శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.184.35 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.57.16 కోట్లు.
- అటవీ శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.134.49 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.398.17 కోట్లు.
- సహకార శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.6.87 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.190.61 కోట్లు.
- జలయజ్ఞం పనులకు ప్రణాళికా వ్యయం కింద రూ.13,804 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.874.68 కోట్లు
- పట్టు పరిశ్రమాభివృద్ధికి ప్రణాళికా వ్యయం కింద రూ.79.20 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.122.40 కోట్లు.
- ధాన్యం గిడ్డంగుల నిర్మాణానికి రూ.41.77 కోట్లు
- ఆగ్రో ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.120 కోట్లు
- చక్కెర రంగానికి ప్రణాళికా వ్యయం కింద రూ.52.05 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.57.93 కోట్లు.
- ఉచిత విద్యుత్‌కు రూ.3,621.99 కోట్లు
- 16 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ అందించేందుకు రూ.1,154.80 కోట్లు
- మార్కెట్ ఆలంబన నిధి కింద రూ.100 కోట్లు
- ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి రూ.589.04 కోట్లు
- ప్రాజెక్టుల కోసం ప్రస్తుత (2012-13) ఆర్థిక సంవత్సరానికి రూ.15,013 కోట్లను కేటాయించగా, రానున్న ఏడాదికి రూ.13,804 కోట్లను మాత్రమే కేటాయించారు. అంటే రూ.1,209 కోట్ల మేర కోత విధించారు.
- భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్లను కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.3,357 కోట్లను కేటాయించారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ రూ.15 వేల కోట్లు కాగా ఇప్పటివరకు రూ.8,342 కోట్లను మాత్రమే వ్యయం చేయగలిగారు.
ప్రాజెక్టు పేరు | 2012-13 | వ్యయం | 13-14 |
కంతనపల్లి | 70 | 00 | 80 |
సాగర్ ఆధునీకరణ | 700 | 416.45 | 678 |
ఎస్‌ఎల్‌బీసీ | 450 | 242.45 | 420 |
సోమశిల | 190 | 88.31 | 400 |
ఎస్‌ఆర్‌ఎస్‌పీ-1 | 140 | -- | 160 |
ఎస్‌ఆర్‌ఎస్‌పీ-2 | 75 | 40.28 | 40 |
దేవాదుల | 725 | 383.39 | 382 |
రాజీవ్ దుమ్ముగూడెం | 150 | 104.88 | 820 |
ఇందిరా దుమ్ముగూడెం | 150 | 30.72 | 30 |
దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ | 35 | 0.06 | 97 |
ప్రాణహిత-చేవెళ్ల | 1100 | 970.13 | 737 |
గాలేరు-నగరి | 400 | 133.84 | 321 |
హంద్రీ-నీవా | 600 | 271.95 | 416 |
తుంగభద్ర | 93 | 36.50 | 115 |
పోలవరం | 850 | 219.19 | 547 |
రాజోలిబండ | 19 | -- | 13 |
జూరాల | 61 | -- | 49 |
నెట్టెంపాడు | 150 | 90.23 | 88 |
కల్వకుర్తి | 2201 | 09.88 | 122 |
ఎల్లంపల్లి | 350 | 310.76 | 450 |
ఎస్‌ఆర్‌బీసీ | 110 | 48.63 | 70 |
పులిచింతల | 165 | 155.63 | 200 |
కృష్ణాడెల్టా | 300 | 278.22 | 332 |
గోదావరి డెల్టా | 300 | 165.76 | 180 |
ఏడాది | కేటాయింపు | వ్యయం |
2006-07 | 10,042 | 9,109.42 |
2007-08 | 13,014 | 12,039.45 |
2008-09 | 16,511.50 | 10,002.29 |
2009-10 | 17,811.50 | 12,154.88 |
2010-11 | 15,011.04 | 9,627.07 |
2011-12 | 15,010 | 11,369.49 |
2012-13 | 15,010.20 | 8,342.79 (ఇప్పటివరకు) |
2013-14 | 13,804 | ----- |
అంశం | 2012-13 | 2013-14 |
కేంద్ర పన్నుల వాటా | 20,270.77 | 24,132.36 |
ఆదాయ వ్యయాలపై పన్ను | 619.55 | 710.95 |
ల్యాండ్ రెవెన్యూ | 47.49 | 49.86 |
స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ | 4,968.00 | 6,414.40 |
వ్యవసాయేతర స్థిరాస్తులపై పన్ను | 173.20 | 190.52 |
రాష్ట్ర ఎక్సైజ్ | 10,500.00 | 7,500.00 |
వ్యాట్ | 42,041.32 | 52,500.00 |
మోటారు వాహనాల పన్ను | 3,605.11 | 4,351.99 |
సరుకు, ప్రజా రవాణాపై పన్ను | 12.56 | 13.19 |
విద్యుత్ సుంకం | 304.92 | 335.41 |
ఇతర పన్నులు, సుంకాలు | 299.90 | 376.62 |
వడ్డీల ద్వారా ఆదాయం, డివిడెండ్స్ | 6,936.87 | 8,712.89 |
సాధారణ సర్వీసులు | 472.12 | 496.71 |
సామాజిక సేవలు | 1,078.17 | 1,448.88 |
ఆర్థిక సేవలు | 4,377.08 | 4,735.09 |
కేంద్ర గ్రాంటులు | 13,793.74 | 15,803.30 |
మొత్తం రెవెన్యూ రాబడులు | 1,09,500.81 | 1,27,772.19 |
రాష్ట్ర రుణం రూ.1,79,637.51 కోట్లు
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో అప్పుల వాటా రూ.24,248 కోట్లు. దీంతో రాష్ర్ట ప్రభుత్వం రుణం రూ. 1,79,637.51 కోట్లకు చేరింది. అంటే ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ.21.159.
- తెచ్చిన అప్పుల్లో ఆస్తుల కల్పనకు ( కేపిటల్ వ్యయానికి) రూ.21,278 కోట్లు వినియోగించనున్నారు.
- చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.14,519 కోట్లు కేటాయించారు.
సంవత్సరం | మొత్తం అప్పు(రూ.కోట్లలో) | రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో(అప్పు వాటా (శాతం) |
2009-10 | 1,09,342.69 | 22.30 |
2010-11 | 1,21,743.84 | 20.67 |
2011-12 | 1,35,645.53 | 20.70 |
2012-13 | 1,54,789.34 | 20.96 |
2013-14 | 1,79,637.51 | 20.91 |
పరిశ్రమలకు రూ. 1,119.72 కోట్లు
- పరిశ్రమలకు 2012-13 బడ్జెట్‌లో రూ.894.81 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,119.72 కోట్లు ప్రకటించింది.
- లిడ్‌క్యాప్ ద్వారా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ క్లస్టర్ల ఏర్పాటుకు రూ.12 కోట్లను కేటాయించింది.
- జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ అమలుకు రూ.100 కోట్లను కేటాయించింది.
- గత ఏడాది అన్ని సంక్షేమ శాఖలకు కలిపి రూ.10,079 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది అది రూ. 14,087 కోట్లకు పెంచారు.
- వెనుకబడిన తరగతుల సంక్షేమానికి (బీసీ) రూ.4,027 కోట్లు ప్రకటించారు
- సాంఘిక సంక్షేమానికి రూ.4,122కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ. 2,126 కోట్లు కేటాయించారు.
- మైనార్టీలకు రూ.1,027 కోట్లు. గత ఏడాది కంటే 110 శాతం పెంచి మొత్తం రూ.1,027 కోట్లు కేటాయించారు.
- వికలాంగులకు రూ.73 కోట్లు ఇవ్వనున్నారు.
- మహిళా శిశు సంక్షేమానికి రూ.2,712 కోట్లు కేటాయించారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.5,533 కోట్లు కేటాయించారు.
శాఖ | 2013-14 | 2012-13 | 2011-12 |
ఎస్సీ | 4,122 | 2,677 | 2,357.70 |
ఎస్టీ | 2,126 | 1,552 | 1,230.10 |
బీసీ | 4,027 | 3,014 | 2,104.07 |
మైనార్టీ | 1,027 | 489 | 300.87 |
వికలాంగ | 73 | 64.74 | 48.75 |
మహిళా,శిశు | 2,712 | 2,283 | 1,869.78 |
ప్రస్తుత వార్షిక ప్రణాళికకు రూ.44,959 కోట్లు
వార్షిక ప్రణాళికా వ్యయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 52,955.29 కోట్లుగా ప్రతిపాదించారు.
ప్రణాళికలో రంగాల వారీగా కేటాయింపులు.. (రూ. కోట్లలో)
రంగం | 2013-14 | శాతం |
వ్యవసాయ అనుబంధ, గ్రామీణాభివృద్ధి | 9,056.70 | 17% |
సాగునీరు | 13,792.00 | 26% |
విద్యుత్ | 574.96 | 1% |
సాంఘిక సేవలు | 22,578.67 | 43% |
రవాణా | 3,936.62 | 7% |
పరిశ్రమలు, సాధారణ, ఆర్థిక సేవలు | 3,016.34 | 6% |
మొత్తం | 52,955.29 | 100% |
సొంత పన్నుల ద్వారా రూ. 72,442 కోట్లు
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సొంత పన్నుల ద్వారా రూ.72,442 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- 2013-14లో వ్యాట్ ద్వారా రూ.52,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించారు.
- మద్యంపై వ్యాట్ ద్వారా రూ.7,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
కేంద్ర పన్నుల వాటా ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కూడా రూ. 4 వేల కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా ద్వారా వచ్చే ఆదాయం రూ. 20,270 కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.24,132 కోట్లు వస్తుందని అంచనా వేశారు.
వివిధ పన్నుల ద్వారా అదాయ వివరాలు
రంగం | 2012-13 | 13-14 |
వ్యాట్ | 42,041 | 52,500 |
ఎక్సైజ్ | 10,500 | 7,500 |
మోటారు వాహనాల పన్ను | 3,640 | 4,351 |
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు | 4,968 | 6,414 |
ఇతర పన్నులు | -- | 2,000 |
ఆరోగ్యానికి రూ.6,481 కోట్లు
- గతేడాది ఆరోగ్య రంగానికి రూ. 5,889 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.592 కోట్లు పెంచి రూ. 6,481 కోట్లు కేటాయించారు.
- 108 అంబులెన్సులకు కేవలం రూ.60 కోట్లు, సంచార వైద్యశాలలైన 104కు కూడా రూ.50 కోట్లిచ్చారు.
- ఆరోగ్యశ్రీకి గతేడాది రూ.925 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కూడా అంతే కేటాయించారు.
- గతేడాది జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మ్యాచింగ్ గ్రాంటు కింద రాష్ట్రం రూ.270 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది 360 కోట్లు ఇస్తున్నారు.
విభాగం | 2012-13 | 2013-14 |
డెరైక్టర్ ఆఫ్ హెల్త్ | 1,710 | 1,941 |
వైద్య విద్య | 1,270 | 1,357 |
కుటుంబ సంక్షేమం | 997 | 1,215 |
వైద్యవిధాన పరిషత్ | 659 | 690 |
రాజీవ్ ఆరోగ్యశ్రీ | 925 | 925 |
108 అంబులెన్సులు | 60 | 60 |
104 సంచార వైద్యం | 50 | 50 |
ఎన్‌ఆర్‌హెచ్‌ఎం | 270 | 360 |
మందులకు | 324 | 330 |
సంవత్సరం | ఇచ్చింది | ఖర్చు చేసింది (రూ.కోట్లలో) |
2010-11 | 4,295 | 4,140 |
2011-12 | 5,040 | 4,600 |
2012-13 | 5,889 | 4,800 |
విద్యకు రూ. 16,990 కోట్లు
- 2012-13 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.15,511 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ. 16,990 కోట్లు ఇచ్చింది.
- ఇక ఉన్నత విద్యకు కిందటేడాది రూ.2,830 కోట్లు కేటాయించగా.. 2013-14 బడ్జెట్‌లో రూ.2,818 కోట్లు ఇవ్వనున్నారు.
- సాంకేతిక విద్యకు రూ.1,263 కోట్లు కేటాయించారు.
- పాఠ్యపుస్తకాలకు ఈసారి 103 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాది రూ.102 కోట్లు.
పద్దు | 2011-12 | 2012-13 | 2013-14 |
ప్రణాళికేతర | 9,654 | 11,667 | 13,086 |
ప్రణాళిక | 2,595 | 3,844 | 3,904 |
మొత్తం | 12,249 | 15,511 | 16,990 |
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రూ.4,282 కోట్లు
- 2013-14 సంవత్సరానికి గాను ఫీజుల పథకానికి రూ.4,282 కోట్లు కేటాయించారు.
- ఇందులో రూ.2,800 కోట్లకుపైగా ట్యూషన్ ఫీజు కాగా, 1,400 కోట్లు స్కాలర్‌షిప్‌లకు కేటాయించారు.
- ఎస్సీలకు రూ.1,230 కోట్లు, ఎస్టీలకు రూ.610 కోట్లు, బీసీలకు 2,086 కోట్లు, ఈబీసీలకు రూ.600 కోట్లు, మైనార్టీలకు రూ.320 కోట్లు, వికలాంగులకు రూ.5 కోట్లు ఇవ్వనున్నారు.
సంవత్సరం | కేటాయింపు (రూ. కోట్లలో) |
2009-10 | 2,251 |
2010-11 | 2,270 |
2011-12 | 2,999 |
2012-13 | 3,621 |
2013-14 | 4,282 |
పౌర సరఫరాలకు రూ.3,231 కోట్లు
- 2012-13లో ఈ శాఖకు రూ.3,175 కోట్లు కేటాయించగా.. వచ్చే సంవత్సరాని(2013-14)కి రూ.3,231 కోట్లు మాత్రమే కేటాయించారు.
- వచ్చే ఉగాది నుంచి గోధుమలు, గోధుమపిండి, పంచదార, కందిపప్పు, పామోలిన్, అయోడైజ్డ్ ఉప్పు, చింతపండు, మిరపపొడి, పసుపులను ఒకే బాస్కెట్‌లో రూ.185కే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
- సబ్సిడీ బియ్యం పథకానికి గత బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా అంతే కేటాయించారు.
- ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పర్యాటక శాఖకు రూ.140 కోట్లు ప్రకటించింది.
- రాష్ట్రానికి భారీగా విదేశీ పర్యాటకులు రావాలంటే అంతర్జాతీయ విపణిలో మన పర్యాటకం గురించి విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించడానికి రూ.32 కోట్లు కేటాయించారు.
- ఈ విభాగానికి 2012-13లో ప్రణాళికా వ్యయం కింద రూ.3,210 కోట్లు కేటాయించగా, 2013-14 బడ్జెట్‌లో రూ. 3,511 కోట్లే కేటాయించారు.
- రోడ్ల సాధారణ మరమ్మతులు, నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతభత్యాల కోసం ప్రణాళికేతర వ్యయం కింద రూ. 1,940 కోట్లు కేటాయించారు.
- ఈ శాఖకు 2012-13 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 4,876 కోట్లు కేటాయిస్తే.. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఆ మొత్తం రూ. 4,076 కోట్లకు పడిపోయింది.
- వచ్చే ఏడాదికి ప్రణాళిక పద్దును రూ. 5,137 కోట్లుగా పేర్కొంది.
- అందులో మెట్రోరైలుకు రూ. 500 కోట్లు, ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ. 1,178 కోట్లు, కృష్ణా-గోదావరి నదుల నుంచి నగరానికి నీరు తీసుకుని రావటానికి రూ.430 కోట్లు కేటాయింపులు చేసింది.
- స్టేడియాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు వంటి వాటికి రూ. 20 కోట్లు కేటాయించారు.
- వీటితో పాటు అదనంగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 200 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు 10.32 లక్షల మంది!
- వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 10 లక్షల 32 వేల 757 మంది.
- సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, జిల్లా, క్షేత్రస్థాయిల్లో వీరంతా పనిచేస్తున్నారు. వీరిలో 26.5 శాతం అంటే రెండు లక్షల 73 వేల 418 మంది తాత్కాలిక ఉద్యోగులున్నారు.
- విద్యాశాఖ పరిధిలో 3.75 లక్షల మంది, పోలీసు శాఖలో 1.13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
- సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం మార్చి 2012 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 12,76,054. అంటే వచ్చే ఏడాది దాదాపు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.
- పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 తహసీళ్లను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- మొదటి విడత కింద 10 రెవెన్యూ డివిజన్లు, 25 అర్బన్ తహసీళ్ల (మండలాలు) ఏర్పాటు చేస్తారు.
తొలివిడత కింద ఏర్పాటుకానున్న రెవెన్యూ డివిజన్లు, వాటిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు...
రాజేంద్రనగర్ డివిజన్: కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు (రంగారెడ్డి జిల్లా)
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి)
కల్యాణదుర్గం: కల్యాణదుర్గం, రాయదుర్గం (అనంతపురం)
కదిరి: కదిరి, పుట్టపర్తి (అనంతపురం)
గురజాల: మాచెర్ల, గురజాల, వినుకొండ (గుంటూరు)
రామచంద్రపురం: రామచంద్రపురం, అనపర్తి, మండపేట (తూర్పు గోదావరి)
దేవరకొండ: దేవరకొండ పూర్తిగా, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు (నల్లగొండ)
అనకాపల్లి: ఎలమంచిలి నియోజకవర్గం (విశాఖపట్నం)
ఆత్మకూరు: వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
నాయుడుపేట డివిజన్: నాయుడుపేట నియోజకవర్గం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
ఇంధనశాఖకు రూ.7,117.57 కోట్లు
రాజేంద్రనగర్ డివిజన్: కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు (రంగారెడ్డి జిల్లా)
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి)
కల్యాణదుర్గం: కల్యాణదుర్గం, రాయదుర్గం (అనంతపురం)
కదిరి: కదిరి, పుట్టపర్తి (అనంతపురం)
గురజాల: మాచెర్ల, గురజాల, వినుకొండ (గుంటూరు)
రామచంద్రపురం: రామచంద్రపురం, అనపర్తి, మండపేట (తూర్పు గోదావరి)
దేవరకొండ: దేవరకొండ పూర్తిగా, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు (నల్లగొండ)
అనకాపల్లి: ఎలమంచిలి నియోజకవర్గం (విశాఖపట్నం)
ఆత్మకూరు: వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
నాయుడుపేట డివిజన్: నాయుడుపేట నియోజకవర్గం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
ఇంధనశాఖకు రూ.7,117.57 కోట్లు
- 2013-14 బడ్జెట్‌లో ఇంధనశాఖకు ప్రభుత్వం రూ.7,117.57 కోట్లను కేటాయించింది.
- ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.6,542.61 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ.574.96 కోట్లు మాత్రమే.
‘హోం’ బడ్జెట్ రూ. 5,386 కోట్లు
రాష్ట్ర హోంశాఖకు 2013-14 సంవత్సరానికిగాను రూ. 5,386 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 554 కోట్లు పెరిగింది.
వడ్డీలేని రుణాలకు రూ. 800 కోట్లు
రాష్ట్ర హోంశాఖకు 2013-14 సంవత్సరానికిగాను రూ. 5,386 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 554 కోట్లు పెరిగింది.
వడ్డీలేని రుణాలకు రూ. 800 కోట్లు
- మహిళలకు వడ్డీలేని రుణాల కింద ఇచ్చే ఆర్థిక సాయానికి వచ్చే బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు. -వచ్చే ఏడాది గ్రామీణ మహిళలకు రూ.10 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నది లక్ష్యం.
- ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు గ్రాంటు రూపంలో ఇస్తుండగా... రాష్ట్రం పదిశాతం వాటా చెల్లించాలి.
- వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.8,300 కోట్ల బడ్జెట్‌ను ఖరారు చేసింది. దీనికి తనవాటాగా రాష్ట్రం రూ. 830 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... బడ్జెట్‌లో రూ.507 కోట్లే కేటాయించింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కల్లుగీత కార్మికుల పింఛన్లకు రూ. 18.89 కోట్లు కేటాయిస్తే.. తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ. 15 కోట్లకు కుదించింది.
- ఎయిడ్స్ రోగుల పింఛన్ల నిధులను రూ. 7.55 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గించింది.
- వెఎస్సార్ అభయహస్తం పథకానికి రూ. 228.94 కోట్లు ప్రకటించారు
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పెన్షన్ల కింద రూ. 2,131 కోట్లు కేటాయించారు.
తాజా బడ్జెట్‌లో పేదల ఇళ్లకు కేటాయించింది రూ.2,326 కోట్లే. గతేడాది కేటాయింపు కంటే ఇది రూ.174 కోట్లు ఎక్కువ. ఇందులో ప్రణాళికేతర (నాన్ ప్లాన్) మొత్తం రూ.402 కోట్లు.
యూజర్ చార్జీల ద్వారా రూ.737.91 కోట్లు
- రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు యూజర్ చార్జీల ద్వారా ఏకంగా రూ.737.91 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- 2012-13 బడ్జెట్‌లో యూజర్ చార్జీల ద్వారా రూ.42 కోట్ల మేర ఆదాయం అంచనా వేశారు.
- ఏకమొత్తంలో డీజిల్ కొనే సంస్థలకు రాయితీ తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఆర్టీసీపై ఏటా దాదాపు రూ.800 కోట్ల భారం పడుతోంది.
- బస్సుల కొనుగోలుకు రూ.100 కోట్లు, ఆర్టీసీ రుణాలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ గ్యారంటీ కోసం రూ.160 కోట్లు, వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీ కింద ఆర్టీసీకి గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా రూ.200 కోట్లు, ఎన్జీవోల బస్‌పాసుల రాయితీ రీయింబర్స్‌మెంట్ కింద రూ.17.45 కోట్లు ఇచ్చారు.
పంచాయతీరాజ్ సంస్థలకు రూ. 1,360 కోట్లు
పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక పద్దు కింద రూ. 1,360 కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే ఈసారి రూ. 600 కోట్లు పెరిగింది.
ట్రిపుల్ ఐటీలకు రూ. 353 కోట్లు
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ఏపీ ట్రిపుల్ ఐటీలప్రణాళిక వ్యయం కింద రూ. 353 కోట్లు కేటాయించారు.
చేనేతకు రూ.19 కోట్లు: చేనేతకు బడ్జెట్‌లో కేవలం రూ.19 కోట్లను మాత్రమే కేటాయించింది.
పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక పద్దు కింద రూ. 1,360 కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే ఈసారి రూ. 600 కోట్లు పెరిగింది.
ట్రిపుల్ ఐటీలకు రూ. 353 కోట్లు
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ఏపీ ట్రిపుల్ ఐటీలప్రణాళిక వ్యయం కింద రూ. 353 కోట్లు కేటాయించారు.
చేనేతకు రూ.19 కోట్లు: చేనేతకు బడ్జెట్‌లో కేవలం రూ.19 కోట్లను మాత్రమే కేటాయించింది.
#Tags