Union Bank Of India: డిగ్రీ అర్హత ఉన్న వారికి.. భారీ జీతంతో 1,500 ఉద్యోగాలు

ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అక్టోబర్ 24వ‌ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 13, 2024. ఎంపికైన వారికి నెల‌కు రూ.85,000 కంటే ఎక్కువ జీతం ఉంటుంది. 

ఖాళీల వివరాలు:

  • పోస్టు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్‌-I స్కేల్)
  • మొత్తం ఖాళీలు: 1,500
    • ఎస్సీ: 224
    • ఎస్టీ: 109
    • ఓబీసీ: 404
    • ఈడబ్ల్యూఎస్: 150
    • యూఆర్: 613

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

  • ఆంధ్రప్రదేశ్: 200
  • అస్సాం: 50
  • గుజరాత్: 200
  • కర్ణాటక: 300
  • కేరళ: 100
  • మహారాష్ట్ర: 50
  • ఒడిశా: 100
  • తమిళనాడు: 200
  • తెలంగాణ: 200
  • పశ్చిమ్‌ బెంగాల్: 100

అర్హతలు ఇవే..

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణం.

వయో పరిమితి:

  • 01-10-2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

నెల జీతం:

  • నెలకు రూ.48,480 - రూ.85,920.

ఎంపిక ప్రక్రియ:

  •  ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థులను ఎంపిక చేస్తారు. 

Indian Railways 3445 Clerk jobs: ఇంటర్‌ అర్హతతో రైల్వేలో 3445 క్లర్క్‌, TC, టైపిస్ట్‌ ఉద్యోగాలు జీతం 21700

దరఖాస్తు ఫీజు:  

  • జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు.. రూ.850
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు.. రూ.175

ఆన్‌లైన్ పరీక్ష/ సబ్జెక్టులు:

  1. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్: 45 ప్రశ్నలు (60 మార్కులు).
  2. జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు (40 మార్కులు).
  3. డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్: 35 ప్రశ్నలు (60 మార్కులు).
  4. ఇంగ్లిష్ లాంగ్వేజ్: 35 ప్రశ్నలు (40 మార్కులు).
  5. ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్ & ఎస్సే: 2 ప్రశ్నలు (25 మార్కులు).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..

  • అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ముఖ్య‌మైన‌ తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 24, 2024 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ:నవంబర్ 13, 2024 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: Unionbankofindia.co.inను సంప్రదించండి.

Telangana Outsourcing Computer Operator jobs: ఇంటర్‌ అర్హతతో తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు...నెలకు జీతం 34,000

#Tags