PNB SO Recruitment 2024- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 1025

ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు
మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు
మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు


అర్హత: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
 
వయో పరిమితి: పోస్టులను బట్టి 21-38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: 07.02.2024
దరఖాస్తులకు చివరితేది: 25.02.2024.

మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/ ను సంప్రదించండి. 
 

#Tags