Posts at Bank of Maharashtra : బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రాలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

పుణె (మహారాష్ట్ర)లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 195.
»    పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌.
»    విభాగాలు: రిస్క్‌ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ఫోలియో అనాలసిస్‌–ఐసీఏఏపీ, ఎంటర్‌ప్రైజ్‌–ఆపరేషన్‌ రిస్క్, మార్కెట్‌ రిస్క్, రిస్క్‌ అనలిటిక్స్‌–రిస్క్‌ మేనేజ్‌మెంట్,రిస్క్‌ మేనేజ్‌మెంట్, డొమెస్టిక్‌–ఫారెక్స్, ఫారెక్స్, డొమెస్టిక్‌ ట్రెజరీ, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్చర్, డేటా ఆర్కిటెక్చర్, ఐటీ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌ 
తదితరాలు.
»    అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని 
అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు స్కేల్‌–2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960, స్కేల్‌–3 పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280, స్కేల్‌–4 పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940, స్కేల్‌–5 పోస్టులకు రూ.1,20,940 నుంచి రూ.1,35,020, స్కేల్‌–6 పోస్టులకు రూ.1,40,500 నుంచి రూ.1,56,500.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, హెడ్‌ ఆఫీస్, లోక్‌మంగళ్, 1501, శివాజీనగర్, పుణె–411005 చిరునామకు పంపించాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 11.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.07.2024
»    వెబ్‌సైట్‌: https://bankofmaharashtra.in

UG and PG Course Admissions : కోయంబ‌త్తూర్‌లోని ఈ స్కూల్‌లో యూజీ, పీజీ స‌ర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags