India Exim Bank : ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌తో ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(బ్యాంకింగ్‌ ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 50.
»    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫైనాన్స్‌/ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ఫారిన్‌ ట్రేడ్‌ లేదా చార్టర్డ్‌ అకౌంటెంట్‌లో స్పెషలైజేషన్‌తో పీజీ(ఎంబీఏ/పీజీడీబీఏ /పీజీడీబీఎం/ఎంఎంఎస్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 01.08.2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు రూ.48,480 నుంచి 85,920.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 18.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.10.2024.
»    రాతపరీక్ష తేది: అక్టోబర్‌ 2024.
»    వెబ్‌సైట్‌: www.eximbankindia.in

Specialist Cadre Posts : ఎస్‌బీఐలో రెగ్యులర్‌ ప్రాతిప‌దిక‌న‌ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

#Tags