Posts at Bank of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
వడోదర(గుజరాత్)లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం.. రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 168.
» పోస్టుల వివరాలు: ఫారెక్స్ అక్విజిషన్–రిలేషన్‌షిప్ మేనేజర్–11, ఫారెక్స్ అక్విజిషన్–రిలేషన్‌షిప్ మేనేజర్–04, క్రెడిట్ అనలిస్ట్–80, రిలేషన్‌షిప్ మేనేజర్–66, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్–04, చీఫ్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్స్–03.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎస్ /సీఎఫ్‌ఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024.
» వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
#Tags