Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌(రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌.. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3000
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–100, తెలంగాణ–96.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో  డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

చదవండి: Bank Jobs 2024: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ వి«ధానంలో పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, బేసిక్‌ రిటైల్‌ లయబిలిటీ ప్రొడక్ట్స్, బేసిక్‌ రిటైల్‌ అసెట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.03.2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/

చదవండి: IDBI Notification 2024: ఐడీబీఐలో 500 పోస్టులు.. ఎంపికైతే ఏటా రూ. 6.5 లక్షల వరకు వార్షిక వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags