Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 
వయస్సు: కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. 

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌లో అప్లై  చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005 చిరునామాకి పంపాల్సి ఉంటుంది. 

Indian Navy Recruitment: అవివాహిత యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌.. ఇండియన్‌ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

 

ఎంపిక విధానం: మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
వేతనం: నెలకు రూ. 25,000/-

అప్లికేషన్‌కు చివరి తేది: మే 15, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ bankofbaroda.in ను సంప్రదించండి. 

#Tags