Sakshi Education: విశాఖపట్నంలో గ్రూప్‌–1, 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌–1,2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్‌–1,2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌(www.sakshied ucation.com)ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులను నిర్వహించనుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికి తెల్సిందే.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

గెస్ట్‌ స్పీకర్‌గా బాలలత : ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్‌ టాపర్‌ బాలలత గ్రూప్‌1, గ్రూప్‌ 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్‌ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె గ్రూప్‌1, 2 పరీక్షలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 8977625795 ఫోన్‌ నెంబర్‌కు తమ పేరు, ఫోన్‌ నెంబర్‌, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపగలరు.

ముఖ్య సమాచారం:

అవగాహన సదస్సు తేదీ: నవంబర్‌ 19, 2023(ఆదివారం)
వేదిక: డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ భవన్‌, రీజనల్‌ కంటి ఆస్పత్రి ఎదురుగా, రామా టాకీస్‌ దగ్గర, శ్రీనగర్‌, విశాఖపట్నం.
సమయం: ఉదయం 09.30 నుంచి 12.30 వరకు

లక్ష్యం: గ్రామీణ, పట్టణ విద్యార్థులకు గ్రూప్‌–1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం

#Tags