APPSC: ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి జనవరి మూడో తేదీ వరకు నిర్వహించనున్న 2023 నవంబర్‌ సెషన్‌ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు, జనవరి నాలుగో తేదీన జరిగే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకుల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఇంతి యాజ్‌ బాషా తెలిపారు.

 కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ, రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో ఆయన డిసెంబ‌ర్ 26న‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ బాషా మాట్లాడుతూ.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు 3,034 మంది, పాలిటెక్నిక్‌ అధ్యాపక పరీక్షలకు నలుగురు హాజర వుతారని తెలిపారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

విజయవాడ కొత్తపేట రాఘవరెడ్డి వీధిలో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కండ్రికలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో షిఫ్టుల వారీగా ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల కోఆర్డినేటింగ్‌ అధికారిగా డీఆర్వో వ్యవహరిస్తారని, పర్యవేక్షణ అధికారులను నియమించా మని తెలిపారు.

పోలీస్‌ బందోబస్తు, వైద్య శిబిరం, నిరంతర విద్యుత్‌ సరఫరా తదితరాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు ఏఓ సూచించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ ఏఎస్‌ఓ ప్రమీల, ఎస్‌ఓ కె.భాస్కరరావు, లైజన్‌ ఆఫీసర్లు పి.శ్రీనివాసరావు, రాజరాజేశ్వరి, చీఫ్‌ సూపరింటెండెంట్‌ పి.లోకేష్‌, ఏసీపీ సీఎస్‌బీ బి.పార్థసారఽథి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.మాధవినాయుడు, జేఈ కె.కె.నాగేంద్ర పాల్గొన్నారు.

#Tags