AP TET 2024 Again Exam : మళ్లీ టెట్-2024.. ఈ సారి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా..
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 (AP TET) ఫలితాలు విడుదలైన విషయం తెల్సిందే.
ఈ పరీక్షలకు మొత్తం 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,35,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అందరికీ మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. కేవలం టెట్-2024లో 58.4 శాతం మాత్రమే అర్హత సాధించారు. అలాగే ఈ టెట్‌లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్-2024తో పాటు.. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్ తెలిపారు.
☛ AP DSC -2024 Notification : ఏపీ డీఎస్సీ-2024 పై కీలక నిర్ణయం.. జూలై 1వ తేదీ నుంచి..
#Tags