AP TET 2024 Ranker Success Story : జస్ట్‌మిస్‌... ఏపీ టెట్‌లో 149.99/150 కొట్టానిలా.. కానీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటివ‌లే టెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ఎంతో మంది పెదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తా చాటారు. ఎలాగైన క‌ష్ట‌ప‌డి చ‌దివి... రానున్న డీఎస్సీ నోటిఫికేష‌న్‌లో గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ సాధిస్తామంటున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా చెందిన దాసరి ధనలక్ష్మి ఏపీ టెట్‌లో ఎస్జీటీ కేటగిరి పోస్టు పరీక్షలో 149.99/150 మార్కులు తెచ్చుకుని రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. 

నా చిన్నప్పటి నుంచే..
నా చిన్నప్పటి నుంచి టీచర్‌ ఉద్యోగం అంటే నాకు ఇష్టం. టీచర్‌ అవ్వాలంటే ఇంటర్మీడియట్‌, టీచర్‌ ట్రైనింగ్‌ శిక్షణ కోర్సు చదివితే సరిపోతుందని తెలుసుకుని ఆ చదువులు పూర్తి చేశాను. జూన్‌లో జరిగిన టెట్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయి.

☛➤ AP TET Top Ranker Ashwini Success Story : పెదింటి బిడ్డ‌.. టెట్ ఫ‌లితాల్లో 150/150 మార్కులు కొట్టిందిలా.. కానీ ల‌క్ష్యం ఇదే...!

మా నాన్న ఒక‌ చిరుద్యోగి..
పట్టణంలోని వీటీ అగ్రహారం మా నివాసం. నాన్న వెల్డింగ్‌ షాప్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అమ్మ ఈశ్వరమ్మ గృహిణి. త్వరలో జరిగే డీఎస్సీ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి... టీచర్‌ పోస్ట్‌ సాధిస్తాను అంటున్నారు దాసరి ధనలక్ష్మి.

#Tags