AP TET Response sheet released: ఏపీ టెట్‌ రెస్సాన్స్‌ షీట్‌ విడుదల, మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఇలా తెలుసుకోండి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 టెట్‌ పరీక్షకు సంబంధించి పరీక్షల విద్యాశాఖ రెస్పాన్స్‌ షీట్స్‌(TET Response Sheets)ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్టుల వారీగా ఆన్సర్‌ కీ, అభ్యర్థుల సమాధాన పత్రాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో టెట్‌ పేపర్‌-1కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫైనల్‌ రిజల్ట్‌ ఎప్పుడంటే..
ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. కాగా ఏపీ టెట్‌ పరీక్షలు మార్చి 6 వరకు జరగనున్నాయి. అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.  కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏపీ టెట్‌ 2024 తుది కీని మార్చి 13న రిలీజ్‌ చేస్తారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేస్తారు.


ఏపీ టెట్‌ 2024 రెస్సాన్స్‌ షీట్స్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

1. ముందుగా ఏపీ టెట్ aptet.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
2. హోమ్‌పేజీలో రెస్పాన్స్ షీట్‌ అని ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 
3. అభ్యర్థి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
4. వివరాలు నమోదు చేశాక, AP TET రెస్పాన్స్ షీట్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

#Tags