Women SI Success Story : భర్త కానిస్టేబుల్‌.. భార్యా ఎస్సై ఉద్యోగం సాధించారిలా.. కానీ..

ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎస్ఐ తుది ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన ఎన్‌.అలేఖ్య సివిల్‌ ఎస్సైగా ఎస్ఐ ఉద్యోగంకు ఎంపికైంది.

ప్రస్తుతం ఈమె కొత్తపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2014లో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన అలేఖ్య 2013 బ్యాచ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. గతంలో ఒంగోలు తాలూకా, ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. అలేఖ్య భర్త రామరాజు కూడా కానిస్టేబుల్‌గా ఒంగోలు ఒన్‌టౌన్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు.

➤☛ Ward Volunteer Selected SI Post : వార్డు వలంటీర్‌గా ప‌నిచేస్తూ.. తొలి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

➤☛ Inspirational Story : నేను పుట్టిన‌ నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయా.. ప్ర‌భుత్వ‌ హాస్టల్లో ఉంటూ చ‌దివి ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

కానిస్టేబుల్ టూ..  సివిల్స్‌ ఎస్సైగా..

అలాగే ఈ ఫ‌లితాల్లో ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణానికి చెందిన పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2014లో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన వెంకటేశ్వరరెడ్డి.. 2013లోనే పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం వరించింది. స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా ప్రస్తుతం మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సై పరీక్షలో 6వ ర్యాంకు సాధించిన వెంకటేశ్వరరెడ్డి సివిల్‌ విభాగంలో ఎస్సైగా ఎంపికయ్యారు.

☛ Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ.. 

#Tags