Tomorrow job mela: రేపు జాబ్‌మేళా

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి ఆర్‌.వహీదా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ కృష్ణా ఫార్మసీ వంద ట్రైనీ ఖాళీల భర్తీ చేయనుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాబ్‌ సీకర్‌ లాగిన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి తొలుత వేతనం నెలకు రూ.15 వేలు చెల్లిస్తారని, 2019 నుంచి 2023 మధ్య బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత పత్రాలు ఒరిజినల్స్‌, జెరాక్స్‌ కాపీ, ఫొటోలతో జాబ్‌మేళాకు హాజరుకావాలని ఆమె కోరారు.

15న విజ్ఞాన ప్రదర్శన
విజయనగరం అర్బన్‌: విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, శాస్త్రవిజ్ఞానంపై అవగాహన
కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15న ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహిస్తామని డీఈఓ ఎన్‌.ప్రేమకుమార్‌ సోమవారం తెలిపారు. విజయనగరం పట్టణంలోని శ్రీచలపతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో పోటీలు జరుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల విద్యార్థులు 2022– 23 సంవత్సరంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలకు తీసుకురావాలన్నారు. ఒక్కో ప్రాజెక్టు ప్రదర్శనకు ఒక విద్యార్థి ఒక గైడ్‌ హాజరుకావాలన్నారు. ఉమ్మడి విజయనగరం వేదికగా జరిగే పోటీల్లో మొత్తం 180 ప్రాజెక్టులు ప్రదర్శిస్తామని తెలిపారు. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరియు ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్య ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయని జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ ఎం.కృష్ణారావు తెలిపారు.

చదవండిAndhra Pradesh Jobs 2024: ఆస్పత్రుల్లో 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..!

ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
మహారాణిపేట (విశాఖపట్నం): ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫార్మాసిస్టుల గ్రేడ్‌–2 నియామకాలకు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకు లు డాక్టర్‌ బి.సుజాత (విశాఖ,జోన్‌) నోటిఫికేషన్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ,విశాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 8 ఫార్మాసిస్టు గ్రేడ్‌–2 పోస్టులు భర్తీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను రేసవానిపాలెంలోని ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు వారి కార్యాలయంలో సమర్పించాలన్నా రు. ఇంటర్మీడియట్‌ అర్హతతోపాటు డి.ఫార్మా/ బి.ఫార్మా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. వివరాల కోసం https://nagendrasvast.wordpress.com వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.500, మిగిలిన కులాలకు చెందిన అభ్యర్థులు రూ. 300, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి దరఖాస్తుకు జత చేయాలన్నారు. రీజనల్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ, విశాఖపట్నం పేరిట డీడీ తీయాలని డాక్టర్‌ సుజాత తెలియజేశారు.

#Tags