Andhra Pradesh Jobs 2024: ఆస్పత్రుల్లో 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..!

మహారాణిపేట: ఆంధ్ర వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్‌ స్కూలు పరిధిలో 100 పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.మల్లికార్జున నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఈ నియమాకాలు చేపడుతున్నట్టు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. క్యాన్సర్‌ కేర్‌ సంబంధించి విభాగాలను, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యురాలజీ, నెఫ్రాలాజీ విభాగాలను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల్లో ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. దీని కోసం పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఈనెల 20వ సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్ర వైద్య కళాశాల(విశాఖ) వారి కార్యాలయంలో సమర్పించాలి. www.visakhapatnam.ap.gov.in వెబ్‌సైట్‌, ఆంధ్ర వైద్య కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ www.amc.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

#Tags