AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం!

గత నెలలో నిర్వహించిన ఏపీ విద్యార్థుల ఇంటర్‌ పరీక్షలు ముగిసి, వారి పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. అయితే, బోర్డు అధికారులు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు..

 

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239 ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల 18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది.

PUC Results: ద్వితియ పీయూ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థానం ఇది..

అయితే ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మూల్యాంకనానికి హాజరు కాకపోవడంతో నాలుగు రోజులు ఆలస్యంగా అంటే ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గతేడాది కంటే ముందుగానే పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Students for APPSC Mains: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులు వీరే..!

#Tags