AP Inter Supplementary Exam 2024:ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి
శ్రీకాకుళం : ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్‌మెంట్/బెటర్‌మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌ఐఓ చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
Also Read: Mathematics I-A Study material