AP Intermediate Marks Memo: ఏపీ ఇంటర్‌ పరీక్షల మెమో ఈ లింకుతో పొందవచ్చు..

ఇటీవలె ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం, పరీక్షల మెమోలు కూడా విడుదల చేశారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించిన ఇంటర్‌ 2024 పరీక్షలు పూర్తయ్యి, ఇటీవలె రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అందులో 67% ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరం వారికి నమోదైతే, 78% ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నమోదైంది. ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. చాలామంది ఉత్తీర్ణత సాధించి పాసైతే, మరికొందరు ఫెయిల్‌ అయినవారూ ఉన్నారు.

Inter First Year Memo: https://bieap.apcfss.in/GenFyNeww2024.do

వారికోసం బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది. అయితే, విద్యార్థులు వారి మార్కషీట్లను పొందేందుకు ఇంటర్‌ బోర్డు ఈ లింకు ద్వారా అందజేస్తుంది. విద్యార్థులంతా కింద ప్రకటించిన లింకును క్లిక్‌ చేసి అందులో వారి హాల్‌టికెట్‌ నెంబర్ను నమోదు చేసి మెమోను పొందవచ్చు. అయితే, ఇక్కడ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఒక లింకు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మరో లింకును కేటాయించారు.

Inter Second Year Memo: https://bieap.apcfss.in/GenSyNeww2024.do

ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఏమాత్రం దిగులు చెందకుండా మరో అవకాశంగా ఉన్న సప్లిమెంటరీ పరీక్షను రాసి మార్కులను పొందవచ్చు.

AP Inter Supplementary Exam Dates Announced: ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలయ్యారా? సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

#Tags