AP Intermediate Results: నేడు విడుదల కానున్న ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..
ఏపీ ఇంటర్ విద్యార్థుల పరీక్షలు, వాటి మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. అయితే, విద్యార్థులంతా ఈ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను ప్రకటించిన సమయానికి చూసుకోవచ్చు..
అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు.
Open Inter Evaluation: నేడు ఓపెన్ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..
ఇంటర్మీడియట్‌లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, వారి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
#Tags