AP Inter Supplementary Exams: ఈ నెల 24 నుంచి ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు..

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి జరగనున్న సప్టిమెంటరీ పరీక్షలకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 30తో ప్రధాన పరీక్షలు ముగియనుండగా, తర్వాత 31, జూన్‌ 1 మైనర్‌ సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయి.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఈ నెల 22న వారితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలుంటాయి. పరీక్ష సమయంలో నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Telangana EAPCET 2024 :తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 లో ఏపీ విద్యార్థులు టాప్‌ ర్యాంకులు

అందుబాటులో హాల్‌టికెట్స్‌
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్లకు పంపారు. విద్యార్థులు నేరుగా ప్రిన్సిపాళ్లను సంప్రదించి హాల్‌టికెట్లను అందుకోవచ్చు. అలాగే మంగళవారం నుంచి https:// apbiercres.osdes.in వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌ తెలిపారు. విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం చేయాల్సిన అవసరం లేదన్నారు.
 

#Tags