AP Inter Supplementary Exam Dates 2024 : ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి మ‌రో అవకాశం.. సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు, రీకౌంటింగ్‌, రీవాల్యూయేషన్ తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత త్వర‌గానే ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది. అలాగే ఇంట‌ర్ సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్‌ జిల్లా నిలిచింది. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.  అయితే ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. అలాగే ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో 63 శాతంతో ఆఖరి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. 

రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే.. 
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప‌రీక్ష‌లు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు. 

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంట‌ర్‌ సప్లిమెంటరీ పరీక్షల 2024 షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేసింది. అలాగే ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి పరీక్ష ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఇంట‌ర్‌ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే 24వ తేదీ నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే స‌ప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను మే 01 తేదీ నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఇంట‌ర్‌ రీకౌంటింగ్‌, రీవెరిపికేషన్ అవకాశం..
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన.., మార్కులు తక్కువ వచ్చాయని భావించిన అభ్యర్థులకు రీకటింగ్, రీ వెరిఫికేషన్‌ బోర్డ్ అవకాశం కల్పించింది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్ ఉత్తీర్ణ‌త శాతం ఇలా..
☛ కృష్ణా జిల్లా-84 శాతం
☛ గుంటూరు- 81 శాతం
☛ ఎన్టీఆర్‌-79 శాతం

ఇంటర్మీడియట్ సెకండ్‌ ఇయర్ ఉత్తీర్ణ‌త శాతం ఇలా..
☛ కృష్ణా-90 శాతం
☛ గుంటూరు-87 శాతం
☛ ఇక ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు. 

ఇంట‌ర్ ప‌బ్లిక్  పరీక్షలకు సంబంధించి ముఖ్య‌మైన‌ వివరాలు ఇలా.. 

☛ పరీక్షలకు హాజరైన 10,53,435 మంది విద్యార్థులు 
☛ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు 
☛ సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు 
☛ సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి అడ్డుకట్ట 
☛ సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు 
☛ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్
☛ ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లానే టాప్
☛ రెండో స్థానంలో గుంటూరు జిల్లా
☛ మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
☛ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతం
☛ సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతం
☛ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
☛ ఒకేషన్ లో 71 శాతం ఉత్తీర్ణత
☛ పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు
☛ ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి
☛ ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు
☛ ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి
☛ ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా 84 శాతం
☛ రెండో స్థానం గుంటూరు జిల్లా 81 శాతం
☛ మూడో స్థానం ఎన్టీఆర్ జిల్లా 79 శాతం
☛ ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లోమొదటి స్థానం కృష్ణా జిల్లా 90 శాతం
☛ రెండో స్థానం గుంటూరు జిల్లా 87 శాతం
☛ ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం

☛ AP Inter 1st, 2nd Year Results 2024 కోసం క్లిక్ చేయండి

#Tags