Skip to main content

AP Inter Supplementary Exam 2024: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఇదే.. మళ్లీ నో ఛాన్స్‌

AP Inter Supplementary Exam 2024
AP Inter Supplementary Exam 2024

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్‌) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు.

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి.

మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్‌ 1 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ గుర్తించాలని సౌరభ్‌ గౌర్‌ విజ్ఞప్తి చేశారు.
 

 

Published date : 15 Apr 2024 11:54AM

Photo Stories