AP DSC Notification Update News : ఏపీ డీఎస్సీపై మంత్రి క్లారిటీ ఇదే.. రెండు మూడు రోజుల్లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 29వ తేదీన‌(శుక్ర‌వారం)మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై ఒక స్ప‌ష్ట‌మైన‌ నిర్ణయం వస్తోందని తెలిపారు. ఈ డీఎస్సీపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. దీనిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటారని మంత్రి తెలిపారు.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని బొత్స చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్‌ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టు­లు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేశామ‌న్నారు. ఈ సారి ఎక్కువ పోస్టుల‌కే డీఎస్సీ నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛ Central Government Teaching Jobs 2023 : కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు.. ఖాళీల పూర్తి వివ‌రాలు ఇవే.. త్వ‌ర‌లోనే..

 Government Teacher Jobs : గుడ్ న్యూస్‌.. 38,800 టీచ‌ర్ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags