AP DSC 2024 Updates : డీఎస్సీ-2024.. జిల్లాల్లోని 80% స్థానికులకే టీచ‌ర్ పోస్టులు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 16,347 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి జూన్ 30వ తేదీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తోంది. అలాగే ఏపీ టెట్‌-2024 నోటిఫికేష‌న్‌ను కూడా డీఎస్సీ నోటిఫికేష‌న్‌తో పాటే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

అలాగే ఈ ప్ర‌క్రియ మొత్తం జూలై 1వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 10వ తేదీలోపు పూర్తి చేస్తామ‌న్నారు. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మొత్తం పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661, ఎస్సీ సంక్షేమ శాఖలో 439, బీసీ సంక్షేమ శాఖలో 170, ఎస్టీ సంక్షేమ శాఖలో 2,024, విభిన్న ప్రతిభావంతుల శాఖలో 49 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

ఏపీలోని జిల్లాల వారిగా టీచ‌ర్ పోస్టుల‌ ఖాళీల వివ‌రాలు ఇవే..

  జిల్లా ఖాళీలు
1 శ్రీకాకుళం 543
2 విజ‌య‌న‌గ‌రం 583 
3 విశాఖప‌ట్నం 1134 
4 తూర్పు గోదావ‌రి 1346 
5 పశ్చిమ గోదావ‌రి 1067
6 కృష్ణా 1213 
7 గుంటూరు 1159
8 ప్రకాశం 672
9 నెల్లూరు 673 
10 చిత్తూరు 1478
11 కడప 709 
12 అనంతపురం 811
13 కర్నూలు 2678

#Tags