DSC Exam 2024: మెగా కాదు.. చోటా డీఎస్సీ.. ఈ జిల్లాలో పోస్టులు 500 లోపే!

మెగా కాదు ఇది చోటా డీఎస్సీ..

చిత్తూరు: ముఖ్యమంత్రి హోదాలో మెగా డీఎస్సీపై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది పేరుకు మెగా డీఎస్సీ అయినా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 500 లోపు మాత్రమే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

IT Companies Likely To Onboard Freshers: ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..

నాలుగు నెలల క్రితమే..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో చిత్తూరు, తిరుపతి, మదనపల్లె కలిపి ఉమ్మడి జిల్లాకు సంబంధించి 336 పోస్టులను ఖాళీలుగా చూపించింది. వీటిలో స్కూల్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు (ఎస్జీటీ) 101, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 97, టీజీటీ 139 చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటితో జోన్‌ వారీగా ఏపీ మోడల్‌ స్కూల్‌, బీసీ, సోషల్‌, ట్రైబల్‌ వెల్పేర్‌ పాఠశాలతో పాటు ఏపీ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లోనూ ఖాళీలు చూపించింది.

Job Mela: రేపు గుంటూరులో జాబ్ మేళా.. అర్హులు వీరే!

మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో డీఎస్సీను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలిసంతకం అని హామీ ఇచ్చి, ఆ మేరకు మెగా డీఎస్సీ పేరిట ఇప్పుడు చంద్రబాబు సంతకం కూడా పెట్టారు.

Data Science: డేటా సైన్స్‌లో విస్తృత పరిశోధనలు చేయాలి..

ఖాళీలు చూపితే తప్ప..

ఈ డీఎస్సీలో పోస్టులు పెద్దగా ఉండకపోవడం వల్ల చోటా డీఎస్సీనే అని నిరుద్యోగులు భావిస్తున్నారు. పైగా జిల్లాల వారీగా విద్యాశాఖలో ఉన్న టీచర్‌ పోస్టుల ఖాళీలను తీసుకున్న తరువాత నోటిఫికేషన్‌ వెలువడడం ఆనవాయితీ. కానీ ఇపుడు నోటిఫికేషన్‌పై సంతకం పెట్టేశాం.. ఖాళీలు చూపండి అనే పరిస్థితి. జిల్లాలో ఎస్జీటీ, ఎస్‌ఏతో పాటు టీజీటీ పోస్టుల ఖాళీలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించాల్సి ఉంది. ఈనెలాఖరుకు గానీ ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Job Mela 2024: ఐటీఐ పూర్తిచేశారా? రేపే జాబ్‌మేళా, జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా..

#Tags