AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షలు మార్చి 18వ తేదీన ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. ఏపీలో లోక్ స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో.. అత్యంత వేగంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పరీక్షాపత్రాల మూల్యాంక‌నం చేయ‌నున్నారు.

ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది విద్యాశాఖ.

☛ Telangana 10th Results 2024 Release Date : 10వ తరగతి ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..? అత్యంత వేగంగానే టెన్త్ ప‌రీక్ష‌ల వాల్యూయేషన్..!

ఈసారి పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షల కోసం 3,473 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి పరీక్షల కోసం రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.

ఏప్రిల్ 8వ తేదీలోపు..

8, 9 రోజుల్లోనే పూర్తిస్థాయిలో టెన్త్‌ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కార్యాచరణను రూపొందించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియనుప్రారంభించనుంది పరీక్షల విభాగం. ఈ వాల్యూయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 8వ తేదీలోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ మూల్యాంకన ప్రక్రియ జరగనుంది. సిబ్బంది కొరత లేకుండా పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో కూడా సీనియర్‌ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్పాట్ కు సంబంధించి సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సి ఉంటుందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది.

చ‌ద‌వండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ఏపీ టెన్త్‌ ఫలితాలు ఎప్పుడంటే..?

ఈ సారి ఏపీ పదో తరగతి ఫలితాలుముందుగానే రానున్నాయి. గత షెడ్యూల్ చూస్తే.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. 18వ తేదీ వరకు కొనసాగాయి. మే 6వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూస్తే.. మార్చి 18వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభమైన.. మార్చి 30వ తేదీతోనే ముగియనున్నాయి. దీంతో ఈసారి పదో తరగతి ఫలితాలు తొందరగానే రానున్నాయి. అన్ని కుదిరితే.. మే మొదటి వారంలోనే టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద్‌ రెడ్డి తెలిపారు.

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద్‌ రెడ్డి  తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు దేవానంద్‌ రెడ్డి. ఇందు కోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

మే మొదటి వారంలోనే..

గతంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లో మూల్యాంకనం జరిగేది కాదని, ఈసారి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మే మొదటి వారానికి అంతా పూర్తి చేసి, ఎన్నికల కమిషన్‌ అనుమతితో, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు. మూల్యాంకనం కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని దేవానంద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో గతంలో నిర్వహించిన చోట సరైన సౌకర్యాలు లేవని గుర్తించి, ఈసారి వాటిని అనువైన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేషన్‌తో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. 

రీ వెరిఫికేషన్‌కు..
ప‌దో ప‌రీక్ష పేప‌ర్ల‌ మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా­రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చా­మన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌ లింక్‌ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాం­కనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

How to Check AP SSC Results 2024..?
☛ ఏపీ టెన్త్ ప‌బ్లిక్ పరీక్ష రాసిన విద్యార్థులు www.sakshieducation.com లోకి వెళ్లాలి.
☛ sakshieducation హోమ్ పేజీలో కనిపించే AP SSC Result 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.మీ హాల్ టికెట్ నంబర్ ని నమోదు చేయాలి.
☛ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
☛ ప్రింట్ లేదా డౌన్‌లోడ్‌ ఆప్షన్ పై నొక్కి మార్క్స్ మెమో కాపీని పొందవచ్చు.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

#Tags