Tenth Class Public Exams Results 2024 : టెన్త్‌ ఫలితాల విడుద‌ల‌పై తాజా స‌మాచారం.. ఏప్రిల్ 8వ తేదీ నాటికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒకేసారి లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఈ సారి విద్యాశాఖ టెన్త్ ఫ‌లితాల విడ‌ద‌ల‌పై ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఈ ఎన్నిక‌ల వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఏపీ విద్యాశాఖ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.

ఈ సారి రాష్ట్ర‌వ్యాప్తంగా.. పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్‌ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.

☛ AP Schools Summer Holidays 2024 : స్కూల్స్‌కు వేసవి సెలవులను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఈసారి భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్నిరోజుంటే..?

ఏప్రిల్ మూడో వారంలోనే ఫ‌లితాలు విడుద‌ల‌..?

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా అత్యంత త‌ర్వాత ఏప్రిల్ 8వ తేదీ నాటికే పూ­ర్తికానుంది. అలాగే ఈ ఫలితాలను సైతం వారం.. పది­రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ మూడో వారంలోనే టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ విని­యో­గం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం టెన్త్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తారు.

☛ Best Course of Intermediate : 'ఇంటర్‌'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?

#Tags