AP 10th Class Results 2024 Release Date : ముగిసిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం.. రిజల్డ్స్ ఎప్పుడంటే..?
గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం ఏప్రిల్ 8వ తేదీతో పూరైంది. మార్చి 30వ తేదీతో పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెల్సిందే.
☛ Best Course of Intermediate : 'ఇంటర్'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?
కేవలం వారం రోజుల్లోనే..
ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం ముందే ప్రకటించిన ప్రణాళిక మేరకు సోమవారంతో మొత్తం ప్రక్రియ పూర్తయినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. 26 జిల్లాల్లో 25 వేలమంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను..
ఇక ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను కూడా ఏప్రిల్ చివరి వారంలో తేదా మే మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు.