AP 10th Class Results Live Updates 2024 : పదో తరగతి ఫలితాల్లో ఈ స్కూల్స్‌ల‌లో అంద‌రూ ఫెయిల్‌.. ఒక్క విద్యార్థి కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ పదో తరగతి ప‌బ్లిక్‌ ఫలితాలు నేడు విడుద‌లైన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే దారుణంగా 17 స్కూల్స్‌లో ఒక్క విద్యార్థి అంటే.. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.

17 స్కూల్స్‌లో 0% ఉత్త‌ర్ణ‌త శాతం వ‌చ్చింది. అయితే ట్విస్ట్ ఏమంటంటే.. ఈ 17 స్కూల్స్‌లో కేవ‌లం ఒక్క స్కూల్స్ మాత్ర‌మే ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉంది. మిగిలిన 16 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి.

☛ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాలను ఒక్కే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ప‌స్ట్‌.. లాస్ట్ జిల్లాలు ఇవే..

ఈ సారి 616615 మంది  విద్యార్థుల టెన్త్‌ పరీక్షలు పరీక్షలు రాశారు. ఈ టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. అలాగే బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 న‌మోదైంది. మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు.ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌-1లో (93.7 శాతం) ఉండ‌గా..చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం) ఉంది. మే 24 నుంచి జూన్‌ 3 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.  అయితే పదో తరగతిలో తప్పిన విద్యార్థులు కుంగిపోవాల్సిన అవసరం లేదని, వాళ్లకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో మరో అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. రేపటి నుంచే  ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, విద్యార్థులు స్కూల్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లో షార్ట్‌ మోమోలు విడుదల చేస్తామన్నారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు 2024 పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags