Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Tenth Exams 2024 - పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
Tenth Exams 2024 - పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

చెరుకుపల్లి: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉర్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధించాలని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. మండలంలోని గుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చెరుకుపల్లి, పిట్లవాని పాలెం, నగరం. నిజాంపట్నం, భట్టిప్రోలు, రేపల్లె, మండలాల్లోని నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల హెచ్‌ఎంలు, ఆయా మండలాల ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read  : తెలుగు స్టడీ మెటీరియల్

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులను వారి వారి సామర్‌ాధ్యన్ని బట్టి గ్రేడులు గా విభజించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలన్నారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగు పరచాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలల్లో జరుగుతున్న నాడు–నేడు పనులు ఏ దశలో ఉన్నాయో పాఠశాలల వారీగా అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో డీవీఎస్‌ శ్రీనివాసరావు, ఏఎస్‌వో సంజీవ్‌, ఎంఈవోలు టి,నవీన్‌కుమార్‌, పులి లాజర్‌, హరిబాబు, కె,సురేష్‌, వెంకటేశ్వరరావు, శేషుబాబు, దేవరాజు, పాఠశాల హెచ్‌ఎం కవిత, విద్యాకమిటీ చైర్మన్‌ మంచాల విజయ్‌కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

#Tags