Free Study Material: జగనన్న విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్‌ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కార్పొరేట్‌ పాఠశాల విద్యార్థుల కన్నా మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

అందులో భాగంగా జెడ్పీ నిధులతో విద్యార్థులకు ‘జగనన్న విద్యా జ్యోతి’ పేరుతో స్టడీ మెటీరియల్స్‌ ఉచితంగా అందజేశారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని మంచి మార్కులు సాధించేలా ఈ పుస్తకాలు ఉపయోగపడనున్నాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఏ డే విత్‌ కలెక్టర్‌ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో చదువులో ముందున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రేరేపితులై పోటాపోటీగా చదువుతున్నారు. విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

#Tags