Guntur News: పాఠశాలలను నడపడంలో హెచ్‌ఎంలది కీలక పాత్ర
సాక్షి ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకి సరైన దిశానిర్దేశం చేస్తూ... మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వీఎస్ సుబ్బారావు తెలిపారు.
బాపట్లలోని విస్తరణ శిక్షణ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా(సీమ్యాట్) ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమ ఆదివారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు కచ్చితంగా సాధించవచ్చని చెప్పారు.
పాఠశాలల్లో చదివిన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఉపాధ్యాయులు పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్జేడీ వి.ఎస్.సుబ్బారావుతో పాటు సెంటర్ ఇన్‌చార్జి వీరభద్రరావు, అకడమిక్ మానిటరింగ్ అధికారి మోజెస్ పాల్గొన్నారు.
#Tags