ఏపీ టెన్త్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేలా.. ‘డిజిటల్ బోధన’
సాక్షి, అమరావతి: టెన్త్ విద్యార్థులు లాక్‌డౌన్ కాలంలో పరీక్షలకు సిద్ధం చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అనేక ఏర్పాట్లు చేసింది.
తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా టెన్త్ పాఠ్యాంశాలను డిజటల్ కంటెంట్‌లో అందించే ఏర్పాట్లు చేసింది. ‘ఈ-కంటెంట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్’ పేరిట సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.
- విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఈ-కంటెంట్ ద్వారా సులభంగా నేర్చుకునేలా ఎస్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలను రూపొందించింది. వీటిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) రూపంలో దీక్షా యాప్‌కు లింక్ చేసింది.
- తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజెస్‌తోపాటు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో మేథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను రూపొందించింది.
- అన్ని పాఠ్యాంశాలను సబ్జెక్ట్ నిపుణులతో వీడియోల ద్వారా బోధన ఉండేలా సిద్ధం చేశారు.
- ఇవేకాకుండా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే కొన్ని వెబ్‌పోర్టళ్లను కూడా ఎస్‌సీఈఆర్టీ డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగం అందుబాటులోకి తెచ్చింది.
- వీటిని క్లిక్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకునేలా డిజిటల్ కంటెంట్‌ను పొందవచ్చు.
వెబ్‌పోర్టల్స్ ఇవీ:
- e-Contents suggested by MHRD https://mhrd.gov.in/e-contents
- Digital Infrastructure for Knowledge Sharing (DIKSHA) https://diksha.gov.in/, https://diksha.gov.in/cbse/
- CBSE Question bank for practice Class X http://cbseacademic.nic.in/revision10.html
- Online Learning App For CBSE & State Board Class 1 to 12& Erudex www.erudex.com
#Tags