Digital Classes in Schools: సర్కారు బడుల్లో డిజిటల్ వెలుగులు
జాతీయ విద్యావిధానం అమలుతో ఇతర రాష్ట్రాల వారితో మన విద్యార్థులు పోటీ పడేలా సన్నద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), స్మార్ట్ టీవీల ద్వారా పాఠ్యాంశాల బోధనకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో నాడు – నేడు కింద అభివృద్ధి చేసిన విశాఖలో 109, అనకాపల్లిలో 334, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 368 స్కూళ్లను ఎంపిక చేశారు. తరగతుల సంఖ్యకు అనుగుణంగా హైస్కూళ్లకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ఫ్రీ ప్రైమరీ స్కూళ్లకు స్మార్ట్ టీవీలను సరఫరా చేస్తున్నారు. ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను యుద్ధ ప్రాతిపదికన తరగతి గదుల్లో అమర్చుతున్నారు.
చదవండి: Stay Safe Online Quiz Competition: స్టే సేఫ్ ఆన్‌లైన్ క్విజ్.. ఒక్కొ విజేతకు రూ.10 వేలు..
తరగతి గదిలోనే విశ్వ వీక్షణం
ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, స్మార్ట్ టీవీలకు ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రీన్ చాక్ బోర్డుపై పాఠ్యాంశాల బోధన జరుగుతుండగా, వాటి స్థానంలో ఐఎఫ్‌పీలను వినియోగించనున్నారు. ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నందున వీటినే టీవీల మాదిరే ఉపయోగించనున్నారు. బైజూస్ కంటెంట్‌తో నిక్షిప్తం చేస్తున్నందున పాఠ్యాంశాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ప్రపంచంలో ఏం జరుగుతుందనేది కళ్ల ముందే కనిపించనుంది.
చదవండి: AICTE: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ద్వారా పాఠ్యాంశాల బోధన చేపట్టాల్సిన నేపథ్యంలో వీటిని ఎలా వినియోగించాలనే దానిపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. సాంకేతికతపై అవగాహన కల్పించాల్సిన నేపథ్యంలో శిక్షణ కోసమని పలు ఇంజినీరింగ్ కాలేజీలను ఎంపిక చేశారు. సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మండలాల వారీగా కేటాయించిన ఇంజినీరింగ్ కాలేజీలకు ఉపాధ్యాయులు హాజరుకావాలి.
శిక్షణకు ఎంపిక చేసిన కాలేజీలు ఇవే
రఘు ఇంజినీరింగ్ కాలేజీ (దాకమర్రి), ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (నీలకుండీలు), దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెకా్నాలజీ (అనకాపల్లి), అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మాకవరపాలెం), రఘు ఇంజినీరింగ్ కాలేజీ (దాకమర్రి), సాయిగణపతి ఇంజినీరింగ్ కాలేజీ (గిడిజాల), విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (దువ్వాడ), విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ వుమెన్( దువ్వాడ).
జిల్లాల వారీగా తొలిదశలో ఇలా..
జిల్లా |
పాఠశాలలు |
ఐఎఫ్‌పీ |
స్మార్ట్ టీవీలు |
శిక్షణకు ఎంపికై న టీచర్లు |
విశాఖపట్నం |
109 |
794 |
146 |
2,287 |
అనకాపల్లి |
334 |
1,146 |
354 |
5,688 |
అల్లూరి |
368 |
1,349 |
205 |
3,908 |