Check for Co-Educational Schools: ఆంధ్రప్రదేశ్ లో ఏకోపాధ్యాయ పాఠశాలలకు చెక్‌

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రాథమిక విద్య బలోపేతానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఆర్‌పీలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. సమగ్రశిక్షకు సంబంధించి మండల విద్యా వనరుల కేంద్రాల్లో సీఆర్పీ వ్యవస్థ పన్నెండేళ్లుగా నడుస్తోంది.
Check for Co-Educational Schools in AP

ఇక నుంచి వీరు సీఆర్‌ఎంటీ(క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్‌)లుగా మారనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సంచార బోధనకు సీఆర్‌టీలను వినియోగించనున్నారు. హాజరు కూడా ఆయా పాఠశాలల సముదాయ ప్రధానోపాధ్యాయుల వద్ద కాకుండా ఎంఈఓల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా 148 మంది

2011లో క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌ (సీఆర్పీ) వ్యవస్థ ఏర్పడింది. జిల్లాలో 194 పాఠశాలల సముదాయాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సముదాయానికి ఒక సీఆర్పీని నియమించారు. ప్రస్తుతం జిల్లాలో194 మందికి గాను 148 మంది విధులు నిర్వహిస్తున్నారు. వ్యవస్థ ఆవిర్భావం నాటి నుంచి వీరంతా బడి బయట పిల్లల వివరాల సేకరణ, పాఠశాలల్లో నమోదు పెంపు, మధ్యాహ్నభోజన పథకం పర్యవేక్షణ, సమగ్రశిక్ష అధికారులు కోరిన సమాచారాన్ని పాఠశాలల నుంచి వివరాలు సేకరించి పంపడం చేసేవారు. అదనంగా ఒకే ఉపాధ్యాయుడు ఉన్న చోట సెలవు పెడితే పిల్లలకు పాఠాలు బోఽధించడం కూడా విధిగా ఉండేది.

AP VRO & VRA Jobs : వీఆర్‌ఏ, వీఆర్వోల‌కు శుభ‌వార్త‌.. ఈ అర్హతలు ఉన్న వారికి..

ఇద్దరు ఎంఈవోల నియామకంతో...

ఇటీవల మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించారు. పాఠశాలల పర్యవేక్షణకు ఎంఈవో 1, 2, సచివాలయాల్లో విద్యా సంక్షేమ సహాయకులున్నారు. బడి బయట పిల్లలను గుర్తించడానికి,నమోదు పెంచడానికి వలంటీర్లున్నారు. దీంతో సీఆర్పీలకు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం తప్పింది. అయితే జిల్లాలోని అన్ని మండలాల్లో ఏకోపాధ్యాయ, ఇద్దరున్న పాఠశాలలున్నాయి. వీటిల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సెలవు పెడితే అక్కడ సీఆర్‌ఎంట సేవలను వినియోగించుకోవాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. అంటే అక్కడ విద్యార్థుల చదువులకు ఇబ్బంది తలెత్తకుండా సీఆర్‌ఎంటీలు సంచార ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించనున్నారు.

#Tags