AP 10th Class Results Live Updates: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. ఈసారి రికార్డు స్థాయిలో..

AP 10th Class Results Live Updates

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్‌ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. రికార్డుస్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారాయన. 

పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితా.లను విద్యార్థులకు ఒక్క క్లిక్‌దూరంలో విద్యార్థులకు సాక్షి అందుబాటులోకి తెస్తోంది.  www. sakshieducation. com వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. 

► Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

 

ఇంకా  ఆయన ఏమన్నారంటే..

  • 6.23 లక్షల మంది  విద్యార్థుల టెన్త్‌ పరీక్షలు పరీక్షలు రాశారు
  • టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి
  • బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17
  • మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు
  • ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌..  96.37 శాతం రిజల్ట్‌
  • ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం)
  • 2,300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత
  • ఒక్కరూ పాస్‌కాని స్కూల్స్‌ 17
  • మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

 

#Tags