AP 10th Class Exam Fees: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇదే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఈ వివరాలు తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.
రూ.50 అపరాధ రుసుంతో 27 నుంచి డిసెంబర్ 2 వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3 నుంచి 9 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నామినల్ రోల్స్, డాక్యుమెంట్లను ప్రధానో పాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోగా అందజేయాలి.
AP School Timings Changed: విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు
పరీక్ష ఫీజును డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి స్కూల్ లాగిన్ ద్వారా చెల్లించాలి. సీఎఫ్‌ఎంఎస్, బ్యాంకు చెల్లింపులను అనుమతించరు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు.
పరీక్ష ఫీజు వివరాలివీ..
- ఫ రెగ్యులర్ విద్యార్ధులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125.
- ఫ మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.110.
- ఫ 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.125.
- ఫ వృత్తి విద్యా కోర్సు విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125తో పాటు అదనంగా రూ.50 చెల్లించాలి.
- ఫ తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు కాండొనేషన్ ఫీజు రూ.300 చెలించాలి.
- ఫ అవసరమైతే మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్లించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags