ఎనర్జీ ఎన్ని రకాలు?

ఎనర్జీ అంటే శక్తి. మనిషిలో ఉన్న శక్తి వల్ల నిరంతరం పని చేయగల్గుతున్నట్లే ఇతర రకాల ఎనర్జీలు (శక్తులు) రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి.

ఎనర్జీలు ఎనిమిది రకాలు.
  1. యాంత్రిక శక్తి
  2. ఉష్ణ శక్తి
  3. కాంతి శక్తి
  4. విద్యుచ్ఛక్తి
  5. శబ్ద శక్తి
  6. అయస్కాంత శక్తి
  7. రసాయన శక్తి
  8. న్యూక్లియర్ శక్తి
శాస్త్రీయ సూత్రాల ప్రకారం శక్తిని కృత్రిమంగా సృష్టించలేం, నాశనం చేయలేం. దీన్ని ఒక రూపం నుండి మరో రూపానికి మార్చవచ్చు. దీనినే ‘‘లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’’ (శక్తి సంరక్షణ సూత్రం) అంటారు.

విశ్వంలో శక్తి ఎప్పుడూ ఉంటుంది. అయితే అది ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుంటుంది.

రైళ్లు, బస్సులు, కార్లు, స్కూటర్లలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారడం వల్ల అవి కదలగలుగుతాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గులలో ఉన్న రసాయనిక శక్తిని మండిస్తే ఉష్ణశక్తిగా మారుతుంది. విద్యుత్ బల్బులో విద్యుచ్ఛక్తి ముందు ఉష్ణశక్తిగానూ, తర్వాత కాంతి శక్తిగానూ మారుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లలో అణుశక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తారు.
#Tags